PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని షాక్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఈపీఎఫ్ఓ!
PF Interest Rate: ఈసారైనా వడ్డీ పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్న పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ మరోసారి షాక్ ఇచ్చింది. పీఎఫ్ అమౌంట్ పై వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే గత దశాబ్ద కాలంలో ఎప్పడూ లేనంత తక్కువ వడ్డీని ఈపీఎఫ్ఓ ప్రకటించడం వల్ల పీఎఫ్ ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
PF Interest Rate: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదైన ఎక్కువ వడ్డీని ఆశించిన పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ నిరాశను మిగిల్చింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు గానూ ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల నిల్వచేసిన డబ్బుపై 8.10 శాతంగా నిర్ణయించినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రకటన చేసింది.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులకు 0.40 శాతం వడ్డీ తగ్గనుంది. 2020 - 21 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.50 శాతంగా గతంలో ప్రకటించారు. మరోవైపు ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం 1977-78 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు పీఎఫ్‌పై 8 శాతం వడ్డీ ఇచ్చారు.
2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-2014, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. 8.5 శాతం వడ్డీని చందాదారులకు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని కొనసాగించారు.
Also Read: Flipkart Realme 8: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.2,099 ధరకే రియల్ మీ స్మార్ట్ ఫోన్!
Also Read: Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook