Flipkart Realme 8: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.2,099 ధరకే రియల్ మీ స్మార్ట్ ఫోన్!

Flipkart Realme 8: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది.  ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ. 16,099 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 2 వేల ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 12:33 PM IST
Flipkart Realme 8: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.2,099 ధరకే రియల్ మీ స్మార్ట్ ఫోన్!

Flipkart Realme 8 Pro: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లను మార్చి 11 నుంచి 16 వరకు ఈ సేల్ జరగనుంది. మిగిలిన వారికి ఈ సేల్ మార్చి 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను ప్రవేశపెట్టింది. Samsung, Apple, Xiaomi, Oppo వంటి అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ సేల్ లో Realme 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 2 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Realme 8 ఆఫర్స్

Realme 8 స్మార్ట్ ఫోన్ 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ.16,099 ధరకు ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ కొనుగోలుపై అనేక బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తున్నాయి. దీని వల్ల ఫోన్ కొనుగోలు ధర గణనీయంగా తగ్గుతుంది.

మీరు ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 5 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంటే ఫోన్ ధర వెయ్యి రూపాయలు తగ్గుతుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 15,099 ధరకు అందుబాటులోకి వస్తుంది. 

Realme 8 స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా.. అత్యధికంగా రూ. 13,000 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్ ను బట్టి దాని ఎక్స్ఛేంజ్ ధరను ఫ్లిప్ కార్ట్ సంస్థ నిర్ణయిస్తుంది. పైన చెప్పిన అన్ని ఆఫర్లు వర్తింపు తర్వాత ఈ ఫోన్ రూ. 2,099 ధరకే కొనుగోలు చేయోచ్చు.  

Also Read: Airtel Axis Credit Card: ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. యాక్సిస్ క్రెడిట్ కార్డులతో చెల్లింపులపై భారీగా ఆఫర్లు!

Also Read: Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News