Portable Neckband Fan: మండుటెండల్లో బయట తిరిగేవారికి బెస్ట్ ఆప్షన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 8 గంటలు కూల్‌నెస్..
Portable Neckband Fan: దంచి కొట్టే ఎండల్లో బయట తిరిగేవారికి పోర్టబుల్ నెక్‌బ్యాండ్ ఫ్యాన్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పోర్టబుల్ నెక్‌బ్యాండ్ ఫ్యాన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Portable Neckband Fan: ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే జనం భయపడిపోతున్నారు. చెమట, ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ఎండలకు హడలిపోతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పోర్టబుల్ ఏసీ, పోర్టబుల్ ఫ్యాన్స్‌తో ఎండల్లో తిరిగేవారు కాస్త ఉపశమనం పొందుతున్నారు. పోర్టబుల్ ఫ్యాన్స్‌లో చౌక ధరలో అందుబాటులో ఉన్న పోర్టబుల్ నెక్ బ్యాండ్ ఫ్యాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు :
పోర్టబుల్ నెక్‌బ్యాండ్ ఫ్యాన్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రారంభ ధర రూ. 479. దీని బ్యాటరీ సామర్థ్యం 200mAh. ఒకసారి చార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుంది. ఇందులో హై, మీడియం, లో.. ఇలా మూడు ఆప్షన్స్ ఉన్నాయి. వాటితో మీరు ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. USB కేబుల్ సహాయంతో దీన్ని ఛార్జ్ చేయవచ్చు.
తేలికపాటి పోర్టబుల్ నెక్‌బ్యాండ్ ఫ్యాన్
పోర్టబుల్ నెక్ బ్యాండ్ ఫ్యాన్ చాలా తేలికగా ఉంటుంది. దాన్ని మీరు మెడకు వేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బరువు ఉంటుంది కాబట్టి ఎంతసేపైనా దాన్ని క్యారీ చేయొచ్చు. దీని బరువు సుమారు 200 గ్రా. మాత్రమే. ఒక రకంగా ఇది మొబైల్ హెడ్ ఫోన్ తరహాలో ఉంటుంది. చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉంటుంది. 360 డిగ్రీ రొటేషన్ ఫీచర్‌తో ఇది అందుబాటులో ఉంది. మీరు బైక్‌పై లేదా కాలినడకన ఎక్కడికి వెళ్లినా దీన్ని మీ మెడకు అడ్జస్ట్ చేసుకుని వెళ్లవచ్చు.
Also Read: MLA slaps Youth: రోడ్లు, తాగునీరు అడిగినందుకు.. యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే
Also Red: CHSL Notification 2022: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.