Red Light In Smart Meter: విద్యుత్ మీటర్‌లో రెడ్ లైట్ గురించి తెలుసా..! నెలకు ఎంత చెల్లించాలంటే..?
Power Saving Tips in Telugu: మీ ఇంట్లో ఉండే విద్యుత్ మీటర్‌లో రెడ్ లైట్ ఎప్పుడూ ఆన్ ఆఫ్ అవుతూనే ఉంటుంది. ఈ లైట్ పూర్తిగా ఆఫ్ అయిపోతే.. మీ ఇంట్లో పవర్ కట్ అయిందని అర్థం. ఈ లైట్ ఫ్రీక్వెన్సీ వేగంగా ఉంటే.. ఎక్కువ పవర్ వినియోగం జరుగుతుందని తెలుసుకోవచ్చు.
Power Saving Tips in Telugu: ప్రస్తుతం ప్రతి ఇంట్లో విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు, ప్రీ పెయిడ్ మీటర్ల వినియోగాన్ని విద్యుత్ శాఖ ప్రోత్సహిస్తోంది. వీటిని వేగంగా అమర్చే కార్యక్రమం చేపట్టింది. పాత మీటర్లలో విద్యుత్ చౌర్యం జరుగుతుందనే ఉద్దేశంతో స్మార్ట్ మీటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గతంలో మీ ఇంట్లో మీటర్‌లో కరెంట్ ఉందో లేదో తెలుసుకోవడానికి అందులో ఒక చక్రం రౌండ్‌గా తిరిగేది. అది తిరుగుతూ ఉంటే పవర్ వినియోగిస్తున్నట్లు.. ఎక్కువ స్పీడ్ తిరిగితే ఎక్కువ పవర్ వినియోగిస్తున్నట్లు అర్థమయ్యేది. అయితే ప్రస్తుతం ఉన్న స్మార్ట్ మీటర్లలో ఓ రెడ్ లైట్ ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. మీరు కూడా గమనించే ఉంటారు.
రెడ్ లైట్ ఆన్ అయిందంటే.. మీ ఇంట్లో పవర్ ఉందని అర్థం. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు విద్యుత్ శాఖ కొత్త టెక్నాలజీతో అప్‌డేట్ చేసిన మీటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ రెడ్ లైట్ ద్వారా లైట్ వెలిగితే.. మీ మీటర్ ఆన్‌లో ఉందని సులభంగా తెలుసుకోవచ్చు. మీటర్‌పై లోడ్ పెరిగేకొద్దీ.. ఈ రెడ్ లైట్ వేగంగా ఆన్ ఆఫ్ అవుతుంది. మీ మీటర్‌పై లోడ్ సాధారణంగా ఉంటే.. కొంత విరామం తర్వాత ఈ రెడ్ లైట్ త్వరగా ఆఫ్ అవుతుంది. వాటర్ మోటార్ లేదా ఏసీ ఆన్ చేస్తే.. రెడ్ లైట్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈ లైట్ కాంతిని బట్టి.. ఇంట్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవచ్చు.
స్మార్ట్ మీటర్‌లోని రెడ్ లైట్ 24 గంటలు ఆన్ ఆఫ్ అయితే పవర్ ఎంత ఖర్చవుతుంది..? ఈ లైట్ బిల్లు ఎవరు చెల్లించాలి..? అని చాలా మందిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఈ లైట్ బర్నింగ్‌కు ఒక నెలలో ఒకటి నుంచి రెండు యూనిట్లు ఖర్చవుతుంది. అంటే మీటర్ రెడ్ లైట్ ఆన్ ఆఫ్ కోసం నెలకు 10 నుంచి 20 రూపాయలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ శాఖకు అనవసరంగా చెల్లించే డబ్బులు ఇవి. ఆ లైట్ ఎంత ఎక్కువగా వెలిగితే.. మనం అంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 11 మంది సభ్యులు ఎన్నిక
Also Read: Interesting Facts: ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఇదే..! జనాభా ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి