PPF Maturity Rules: 5 వేల పెట్టుబడితో 26 లక్షలు పొందే అద్భుత అవకాశం, ఎలాగంటే
PPF Maturity Rules: రిస్క్ లేకుండా భవిష్యత్‌లో అధిక రిటర్న్స్ పొందాలంటే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అత్యుత్తమ మార్గం. వివిధ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 26 లక్షలు పొందే అద్బుత అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం.
PPF Scheme Latest Updates: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌లో అన్నింటికంటే ముఖ్యమైన లాభమేంటంటే ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఉంటుంది. దీనికితోడు అధిక వడ్డీ, ట్యాక్స్ మినహాయింపు ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి ఆప్షన్ ఇది. 15 ఏళ్ల కాల వ్యవధిలో ఈ పధకం అందుబాటులో ఉంటుంది.
మంచి ఆదాయం, అధిక వడ్డీ కోసం చూస్తుంటే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది మంచి దీర్ఘకాలిక పధకం. ఇందులో జీరో రిస్క్ ఉంటుంది. ఏ భారతీయ పౌరుడైనా సరే ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్నించి ఈ పధకంలో ఇన్వెస్ట్‌చేయవచ్చు. మెచ్యూరిటీ అనంతరం విత్ డ్రా చేసే నగదు మొత్తం మీదే అవుతుంది. అంటే ఏ విధమైన ట్యాక్స్ కోత ఉండదు. ట్యాక్స్ మినహాయింపు కూడా ఏడాదికి 1.5 లక్షల వరకూ పొందవచ్చు. మొత్తం 15 ఏళ్ల కాలవ్యవధి ఉంటుంది. 15 ఏళ్ల తరువాత కావాలంటే పొడింగించుకునే అవకాశముంటుంది.
15 ఏళ్ల తరువాత పథకాన్ని పొడిగిస్తే మీకొచ్చే రిటర్న్స్, వేగంగా పెరుగుతాయి. అంటే 5 వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తరువాత ఏకంగా 26 లక్షలకు పైగా అందుకోవచ్చు. మెచ్యూరిటీ తరువాత మూడు మార్గాలుంటాయి. మొదటిది అప్పటివరకూ ఉన్న డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవడం. రెండవది విత్ డ్రా చేయకపోయినా వడ్డీ అందుతుంటుంది. మూడవది మరో ఐదేళ్లకు పొడిగించి ఇన్వెస్ట్ చేయడం.
మొత్తం డబ్బు విత్ డ్రా చేయడం
పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ తరువాత మొత్తం జమ చేసిన డబ్బును వడ్డీతో సహా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎక్కౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే మొత్తం డబ్బులు మీ ఎక్కౌంట్‌లోకి బదిలీ అవుతాయి. మొత్తం డబ్బు, వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతేకాకుండా ఏడాదికి 1.5 లక్షల వరకూ మొత్తంపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. మొత్తం కాలానికి మీరు జమ చేసే మొత్తానికి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఐదేళ్లకు పొడిగించడం
ఇక మరో పద్ధతి పీపీఎఫ్ కాల వ్యవధిని మరో ఐదేళ్లు పొడిగించడం. ఇలా ఐదేళ్లకోసారి మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే మెచ్యురిటీ గడువుకు ఏడాది ముందు సంబంధిత పోస్టాఫీసు లేదా బ్యాంకుకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఒకసారి పొడిగించిన తరువాత ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్‌కు పూర్తి అవకాశముంటుంది. ఎలాంటి షరతులు వర్తించవు. పూర్తిగా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా పొడిగింపు
మీరు కనుక ఇక్కడిచ్చిన రెండు ఆప్షన్స్ ఉపయోగించకపోతే అంటే డబ్బులు విత్ డ్రా చేయకపోయినా లేక ఐదేళ్లు పొడిగించకపోయినా ఎక్కౌంట్ దానికదే కొనసాగుతుంది. అదనంగా ఇన్వెస్ట్‌మెంట్ అవసరముండదు. మరో ఐదేళ్లకు పొడిగింపబడుతుంది. అంతేకాకుండా ఈ ఐదేళ్ల కాలానికి అప్పటి వరకూ ఉన్న డబ్బులపై వడ్డీ కూడా అందుకోవచ్చు. ఐదేళ్లు పూర్తయితే మరోసారి పొడిగించబడుతుంది.
5000 పెట్టుబడి 26 లక్షలు ఎలా అవుతుంది
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ పథకంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ వార్షికంగా లెక్కిస్తుంటారు. కానీ నిర్ణయించేది ప్రతి త్రైమాసికానికి ఓసారి. గత కొద్దికాలంగా పీపీఎఫ్ వడ్డీపై ఎలాంటి మార్పు లేదు. 15-20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు పొందవచ్చు.
నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్ల తరువాత 3.18 లక్షలు, 20 ఏళ్లకు 5.24 లక్షలు, 25 ఏళ్లకు 8.17 లక్షలు అందుతాయి. అదే నెలకు 2 వేలు పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు 6.37 లక్షలు, 20 ఏళ్లకు 10.49 లక్షలు, 25 ఏళ్లకు 16.35 లక్షలు తీసుకోవచ్చు. ఇక నెలకు 3 వేలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్ల తరువాత 9.55 లక్షలు, 20 ఏళ్లకు 15.73 లక్షలు, 25 ఏళ్లకు 24.52 లక్షలు అందుకోవచ్చు. ఇక నెలకు 5 వేలు పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు 15.92 లక్షలు, 20 ఏళ్లకు 26.23 లక్షలు, 25 ఏళ్లకు 44.88 లక్షలు అందుకోవచ్చు.
Also read: PPF Deadline: పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, మార్చ్ 31లోగా పూర్తి చేయకపోతే ఎక్కౌంట్లు క్లోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook