Cryptocurrency: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది.  క్రిప్టోకరెన్సీపై కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన వ్యాఖ్యలేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ( Cryptocurrency) విలువ పెరుగుతోంది. చాలా వేగంగా మార్కెట్‌లో దూసుకొస్తోంది. ఈ తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్( RBI Governor Shaktikanta das) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఇండియాలో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టోకరెన్సీలు  ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బిఐ ఆందోళన చెందుతోందని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ( Private cryptocurrency)లను నిషేధించి, ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.


డిజిటల్ కరెన్సీ ద్వారా మోసానికి పాల్పడుతున్నారనే విషయం వెలుగులో వచ్చినప్పుడు 2018లో ప్రైవేటు క్రిప్టోకరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించి ఆర్‌బీఐ ( RBI) నిషేధించింది. కానీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఆర్‌బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్‌ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం( Central government) వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్‌ యువాన్‌తో పాటు డిజిటల్‌ కరెన్సీ ( Digital Currency) ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్‌ చేరనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపై నిపుణులు పని చేస్తున్నారు. బిట్ కాయిన్ ( Bit coins) ధరలపై టెస్లా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా టెస్లా షేర్లు విపరీతంగా పడిపోయాయి. క్రిప్టోకరెన్సీని అనుమతిస్తే కచ్చితంగా దేశ ఆర్ధిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందన్న ఆర్బీఐ వాదన నిజమేనని చాలా మంది ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు. 


Also read: Pm modi on privatisation: నాలుగు రంగాలు తప్ప అన్నీ ప్రైవేటుపరం కాబోతున్నాయా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook