Pm modi on privatisation: నాలుగు రంగాలు తప్ప అన్నీ ప్రైవేటుపరం కాబోతున్నాయా

Pm modi on privatisation: ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంగా ఆలోచన ఉంది. ఒక్క విశాఖ స్టీల్‌ప్లాంట్ మాత్రమే కాదు భవిష్యత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకూ ప్రైవేట్ కాబోతున్నాయి. ప్రదాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2021, 12:23 AM IST
  • ప్రైవేటీకరణ అంశంపై జరిగిన వెబినార్ లో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
  • వారసత్వంగా వస్తుందనే భావనలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని నడపలేమన్న మోదీ
  • నాలుగు వ్యూహాత్మక రంగాలు తప్ప అన్నీ ప్రవేటుపరానికి కేంద్రం సిద్ధం
Pm modi on privatisation: నాలుగు రంగాలు తప్ప అన్నీ ప్రైవేటుపరం కాబోతున్నాయా

Pm modi on privatisation: ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఒక్క విశాఖ స్టీల్‌ప్లాంట్ మాత్రమే కాదు భవిష్యత్‌లో ప్రభుత్వరంగ సంస్థలు చాలా వరకూ ప్రైవేట్ కాబోతున్నాయి. ప్రదాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా సాధించుకున్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ( Vizag steelplant privatisation) అంశంపై దుమారం రేగుతోంది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం బలపడుతోంది. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ( Ysr congress party) ఉద్యమానికి బహిరంగంగా మద్దతిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ విన్పిస్తోంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ( Central government) నిర్ణయం మాత్రం  మారేలా కన్పిచడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రదాని నరేంద్ర మోదీ స్పష్టం చేయడమే దీనికి నిదర్శనం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యాన ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ( Pm modi) ఈ వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వస్తున్నాయనే భావనతో వాటిని నడపలేమని స్పష్టం చేశారు మోదీ. ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిపుష్టం చేసేందుకు ఆర్ధిక సహాయం అందించడమనేది పెనుభారంతో కూడుకున్న వ్యవహారమన్నారు. 

అనేక ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, అవి ప్రజల ధనంతో నడుస్తున్నాయని మోదీ ( Pm modi) చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ప్రభుత్వం వైదొలగే రంగాలను ప్రైవేటురంగం భర్తీ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరని..ఇప్పుడు వేరని ప్రదాని మోదీ వెల్లడించారు. వ్యాపారరంగానికి కేంద్ర ప్రభుత్వం తమవంతు తోడ్పాటును అందిస్తుందని..ప్రభుత్వం స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు.

Also read: Coronavirus new strain: ఢిల్లీలో ఆ రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ, నెగెటివ్ రిపోర్ట్ చూపిస్తేనే ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News