RBI Interest Rates: వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నియంత్రించేది ఆర్బీఐ. ప్రతి మూడు నెలలకోసారి జరిగే సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుుంది. ఈసారి జరగనున్న సమీక్షలో ఆ వడ్డీ రేట్లు పెరగనున్నాయని తెలుస్తోంది. RBI policy monitoring committee to review on interest rates, likely to increase reverse repo rate


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత ఆర్దిక సంవత్సరం అంటే 2021-22కు సంబంధించి చివరి త్రైమాసిక సమీక్షకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఫిబ్రవరి 10 నుంచి 13వ తేదీవరకూ ఈ సమీక్షను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్వహించనుంది. ఈ సమీక్షలో వడ్డీ రేట్లపై కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన వడ్డీ రేట్లను పెంచేందుకు ఆర్బీఐ యోచిస్తోందని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్ క్లేస్ అంచనా వేసింది. రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.25 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా కేంద్ర బడ్జెట్ లో సమీకరణ పరిమాణాన్ని పెంచినందుకే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తానికి వడ్డీ రేట్లు పావు శాతం పెంచనుంది ఆర్బీఐ (RBI). పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐ సంకేతాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలివీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook