RD Interest Rates News: ఇటీవల కాలంలో గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేటు బ్యాంకులు రికరింగ్ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే సీనియర్ సిటిజెన్స్ జమ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే అధిక వడ్డీ లభిస్తున్నప్పటికీ.. ఇటీవల రికరింగ్ డిపాజిట్లపై సైతం బ్యాంకులు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఏయే బ్యాంకుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది, ఏయే బ్యాంకులు ఎంత శాతం వడ్డీ అందిస్తున్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీసీబీ బ్యాంక్ 
డీసీబీ బ్యాంకులో రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం కలిగిన రికరింగ్ డిపాజిట్లపై బ్యాంకు ఏడాదికి 7.6 శాతం వడ్డీ అందిస్తోంది. 5 సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఆర్డీలపై ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.


సర్వోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ప్రైవేట్ సెక్టార్‌లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌లో లీడింగ్‌లో ఉన్న సర్వోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల గడువు కలిగిన రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 7.2 శాతం వడ్డి అందిస్తుండటం విశేషం. ఇది కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ కి అందించే వడ్డీ రేటు కంటే ఎక్కువ. 


ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తమ వద్ద మూడేళ్ల నుంచి 5 ఏళ్ల కాలం పాటు రికరింగ్ డిపాజిట్లు పెట్టే వారికి 7.2 శాతం వడ్డీ అందిస్తోంది. ఇదిలావుంటే, ఇదే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా అధికంగా అందిస్తున్న వడ్డీ రేటు 6.5 శాతం మాత్రమే. అది కూడా 63 నెలల నుంచి 120 నెలల పాటు ఎఫ్‌డి చేసే వారికి మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది.


యాక్సిస్ బ్యాంక్ 
ప్రైవేట్ సెక్టార్‌లో లీడింగ్‌ బ్యాంకుగా పేరున్న యాక్సిస్ బ్యాంక్ 5 సంవత్సరాల సంవత్సరాల గడువు కలిగిన రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 7 శాతం వడ్డి అందిస్తోంది. సీనియర్ సిటిజెన్స్ జమ చేసే రికరింగ్ డిపాజిట్లపై మరో 75 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ అందిస్తున్నారు. అంటే వారికి 7.75 శాతం వడ్డీ రేటు అందనుంది.


హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో 5 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన రికరింగ్ డిపాజిట్లపై ఏడాదికి 7 శాతం వడ్డీ అందిస్తున్నారు. సీనియర్ సిటిజెన్స్‌కి మరో 50 బేసిస్ పాయింట్స్ అదనంగా కలిపి మొత్తం 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. యాక్సిస్ బ్యాంకుతో పోల్చితే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఆర్డీలపై సీనియర్ సిటిజెన్స్‌కి ఇచ్చే వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్స్ తక్కువే అని చెప్పుకోవచ్చు.


ఇండస్‌ఇండ్ బ్యాంకు
ఇండస్‌ఇండ్ బ్యాంకులో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న రికరింగ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డి అందిస్తుండగా.. సీనియర్ సిటిజెన్స్‌కి రికరింగ్ డిపాజిట్లపై మరో 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజెన్స్‌కి ఇచ్చే వడ్డీ రేటు విషయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంకు ఒకే రకమైన వడ్డీ రేటు అందిస్తున్నాయి.


ఇది కూడా చదవండి : Electric Scooters Comparision: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్టో మీరే చూడండి


డచ్ బ్యాంకు
ఇండియాలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ ఫారెన్ బ్యాంకు కస్టమర్లకు రికరింగ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 60 నెలల కాల వ్యవధి.. అంటే ఐదేళ్ల తరువాత మెచ్యురిటీ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై 7.25 వడ్డీ రేటు లభిస్తుందన్నమాట. అదండీ సంగతి.. ఏయే బ్యాంకులో ఎంత అధిక శాతం వడ్డీ రేటు లభిస్తున్నాయి, వాటి మెచ్యురిటీ పీరియడ్ ఎంత అనే వివరాలను ఈ వార్తా కథనం ద్వారా తెలుసుకోవచ్చు.


ఇది కూడా చదవండి : Top CEOs' Salary: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ శాలరీ ఎంతో తెలిస్తే షాకవుతారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK