Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి

Best Home Loan India: మీరు కొత్తగా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఇందుకోసం బ్యాంక్ లోన్‌కు అప్లై చేస్తున్నారా..? అయితే కాస్త ఆగండి. బ్యాంక్ లోన్‌కు అప్లై చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మీరు అధిక వడ్డీలు చెల్లించే అవకాశం ఉంటుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 8, 2023, 06:53 PM IST
Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి

Best Home Loan India: సొంతంగా ఇల్లు ఉండాలని ప్రస్తుతం ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అయితే ఇల్లు కొనడం అంతా ఈజీ కాదు. ఆర్థికంగా ఎంతో భారంతో కూడుకున్నది. మన పూర్వీకులు సంపాదించిన ఆస్తి ఉంటే పర్వాలేదుగానీ.. ఇప్పుడు జాబ్ చేస్తూ అరకొర జీతాలతో ఇల్లు కొనడం కాస్త కష్టమే. హైశాలరీ ఉన్న వాళ్లు ఈజీగా ఇళ్లు కొనేసి.. ఈజీగా ఈఎంఐలు చెల్లిస్తారు గానీ.. బోటాబోటి జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న వారు సొంతంటి ఆలోచనకు ఆమడ దూరంలో ఉంటున్నారు. సొంత ఇళ్లు కొనాలనుకునే వారు మొత్తం నగదు రూపంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ లోన్‌తో ఇళ్లు కొంటే.. వడ్డీ రేట్లపై ఆధారపడి ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక చిన్న శాతం పాయింట్ కూడా నెలవారీ చెల్లింపు, పూర్తి చెల్లింపు ప్రణాళికలో పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తుంది. హోమ్ లోన్ వడ్డీపై ప్రభావం చూపించే అంశాల గురించి తెలుసుకోండి.

సిబిల్ స్కోర్
 
ఏదైనా లోన్ తీసుకోవాలంటే బ్యాంకులు ముందుగా చెక్ చేసేది సిబిల్ స్కోర్. గత లోన్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల ఆధారంగా సిబిల్‌ను లెక్కిస్తారు. ఈ సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే.. బ్యాంకులు సులభంగా లోన్లు మంజూరు చేస్తాయి. అదేవిధంగా వడ్డీ రేటును నిర్ణయించడానికి పారామీటర్‌గా ఉపయోగిస్తారు. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. లోన్లు ఇచ్చే బ్యాంకులు తక్కువ రిస్క్‌గా భావిస్తాయి. సిబిల్ స్కోరు మంచిగా ఉంటే.. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే.. హోమ్‌ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. 

డౌన్ పేమెంట్

లోన్ మొత్తాన్ని వడ్డీ రేట్లు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. మీరు ఇళ్లు కొనాలని ప్లాన్ చేస్తున్నప్పుడే.. ఎంత మొత్తంలో బ్యాంక్‌ లోన్‌కు వెళుతున్నారో ముందుగా లెక్కవేసుకోవడం మంచింది. వడ్డీ రేటును నిర్ణయించడంలో డౌన్ పేమెంట్ మొత్తం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. మీరు తక్కువ డబ్బులకు లోన్‌ కోసం వెళ్లొచ్చు. బ్యాంకులు కూడా తక్కువ రిస్క్‌గా భావించి.. తక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. తక్కువ రిస్క్ ఉన్నవారికి మెరుగైన రేట్లను అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే.. లోన్‌పై తక్కువ వడ్డీ రేటును పొందేందుకు అవకాశం ఉంటుంది.

టైమ్ పిరియడ్..

లోన్ చెల్లింపు కాల వ్యవధి కూడా మరొక ముఖ్యమైన అంశం. లోన్ తీసుకునేవాళ్లు తక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే.. తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందొచ్చు. తక్కువ కాల వ్యవధితో అధిక నెలవారీ చెల్లింపుతో హోమ్‌ లోన్‌ను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. అదేవిధంగా లోన్ తీసుకునే సమయంలో ఫిక్స్‌డ్ వడ్డీ రేటు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉంటుంది. ఏది ఎంచుకోవాలో నిపుణుల సలహా తీసుకోవడం మంచింది. ఇది కూడా మీ లోన్‌పై ప్రభావాన్ని చూపిస్తుంది.  

మార్కెట్ పరిస్థితులు

ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు వంటి మార్కెట్ పరిస్థితులు కూడా హోమ్ లోన్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపిస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం అధిక వడ్డీ రేట్లకు కారణం అవుతోంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ఎక్కువ వృద్ధిని సాధిస్తే.. బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తాయి. అదేవిధంగా తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయి. కేవలం స్వల్పకాలిక ప్రయోజనాలపైనే కాకుండా హోమ్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలపై కూడా ప్రధాన దృష్టి పెట్టాలి. ఏదైనా ఇల్లు కొనేముందు లీగల్ సమస్యలు లేకుండా లాయర్‌తో అన్ని డాంక్యుమెంట్లను చెక్ చేయించుకోవడం ఉత్తమం.

Also Read: KKR Vs PBKS Deam11 Prediction 2023: కేకేఆర్ ఓడితే ఇంటికే.. నేడు పంజాబ్‌తో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..  

Also Read: Mutual Fund Calculator: రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేయండి.. కోటీశ్వరులు అవ్వండి ఇలా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News