Redmi note 11 pro 5g: రెడ్మి నోట్ 11 ప్రో 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..
Redmi note 11 pro 5g: రెడ్మీ నోట్ సిరీస్‌లో 11 ప్రో 5జీ వేరియంట్‌ను విడుదల చేసింది షియోమీ. ఈ ఫోన్ ధర, ఫీచర్ల పూర్తి వివరాలు మీ కోసం.
Redmi note 11 pro 5g: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ.. రెడ్ మీ సరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 11 ప్రో 5జీ పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి (Redmi note 11 pro 5g launched) ఆవిష్కరించింది.
ఈ ఫోన్లో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, హైపర్ ఛార్జింగ్ ఫీచర్లు ప్రధానమైనవి.
ధర ఎంతంటే..?
రెడ్మీ 11 ప్రో 5 జీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 330 డాలర్లు (సుమారు రూ.24,600)గా నిర్ణయించింది కంపెనీ.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 380 డాలర్లు (దాదాపు రూ.28,400)గా ఉంచుంది (Redmi note 11 pro 5g Price) షియోమీ.
రెడ్మీ 11 ప్రో 5 జీ ఫీచర్లు(Redmi note 11 pro 5g features)..
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
మీడియాటెక్ హీలియో జీ9 ప్రాసెసర్
108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో వెనుకవైపు నాలుగు కెమెరాలు (108 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ)
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సైడ్ మౌట్ ఫింగర్ ప్రిట్
ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకట విడుదల చేయలేదు.
గ్లోబల్ మార్కెట్లో వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభం (Redmi note 11 pro 5g sles) కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సరీస్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేసే అవకాశముందని టెక్ వార్తా సంస్థలు (Redmi note 11 pro 5g in India) అభిప్రాయపడుతున్నాయి.
Also read: EPFO Money withdraw: ఉమంగ్ యాప్ ద్వారా కొవిడ్-19 అడ్వాన్స్ ఇలా డ్రా చేయండి..
Also read: Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022 కోసం ప్రత్యేక యాప్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook