Cooking Oils Rates: దేశంలో నిత్యావసర ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన వంట నూనెలు ధరలు..ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా సదరు ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సన్ ఫ్లవర్, సోయాబీన్ నూనెల ధరలు లీటరకు రూ.10 నుంచి రూ.20 మేర తగ్గించాయి. గత వారం అంతర్జాతీయంగా ముడి పామోలిన్, సోయా నూనెల ధరలు 6 నుంచి 11 శాతం తగ్గాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో దేశంలో ధరలు తగ్గిస్తున్నామని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వీ మెహతా చెప్పారు. సరఫరా పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయన్నారు. ఉక్రెయిన్‌ నుంచి సన్ ఫ్లవర్ నూన్ సరఫరా అవుతుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అక్కడి నుంచి సరఫరా ఆగింది. దీంతో రష్యా, అర్జెంటీనా లాంటి దేశాల నుంచి వంట నూనె సరఫరా అవుతోంది.


దేశంలో ప్రస్తుతం శుద్ధి చేసిన సోయాబీన్ నూనె లీటర్ గరిష్ఠ విక్రయ ధర రూ.200 నుంచి రూ.220 ఉంది. సన్‌ ఫ్లవర్ నూనె లీటర్‌ రూ.240 నుంచి రూ.250గా విక్రయిస్తున్నారు.తాజాగా తగ్గిన ధరలతో మార్కెట్‌లోకి రావడానికి పది నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఐతే దుకాణదారులు అధిక ధరలకు కొనుగోలు చేసిన నిల్వలు పూర్తయ్యే వరకు..తగ్గించిన ధరలకు అమ్మే పరిస్థితి ఉండదు.


ఇప్పటికే అదానీ విల్మర్, రుచి సోయా, హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్‌ ధరలను తగ్గించాయి. గత రెండు వారాల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.35 మేర తగ్గింది. రిటైల్ విపణిలో రైస్ బ్రాన్ ఆయిల్ లీటరు రూ.175, సన్ ఫ్లవర్ నూనె రూ.180 నుంచి రూ.190 మేర విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువతి సుంకం సైతం తగ్గడంతో వంట నూనెల ధరలు తగ్గుతున్నాయి.


Also read: India vs South Africa: నేడు భారత్ ,సౌతాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్..మార్పులు చేర్పులు ఇవే..!


Also read: APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై ఛార్జీల పిడుగు..త్వరలో అధికారిక ప్రకటన..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook