APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై ఛార్జీల పిడుగు..త్వరలో అధికారిక ప్రకటన..!

APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై మరో పిడుగు పడబోతోంది. ప్రయాణికులపై మరోసారి వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ డీజిల్ సెస్ బాదుడు ఉండనుందని తెలుస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 17, 2022, 07:46 AM IST
  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై మరో పిడుగు
  • మరోసారి పెరగనున్న బస్సు ఛార్జీలు
  • త్వరలో అధికారిక ప్రకటన
APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై ఛార్జీల పిడుగు..త్వరలో అధికారిక ప్రకటన..!

APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై మరో పిడుగు పడబోతోంది. ప్రయాణికులపై మరోసారి వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ డీజిల్ సెస్ బాదుడు ఉండనుందని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ రెండోసారి డీజిల్ సెస్ రూపంలో టికెట్‌ ఛార్జీలను పెంచింది. అలా ఏపీలో సవరించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

తెలంగాణలో ఈనెల 9 నుంచి కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.170 వరకు ఛార్జీలను పెంచారు. దూరాన్ని బట్టి బస్సు ఛార్జీలను పెంచుతూ రెండోసారి నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగే వాటిలో తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ బస్సుల్లో ఛార్జీలు తక్కువగా ఉన్నాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఏపీ బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈక్రమంలోనే ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసులకు డీజిల్ సెస్ విధించాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు ఏపీవ్యాప్తంగా నడిపే అన్ని సర్వీసుల్లోనూ డీజిల్ సెస్ ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆర్టీసీ అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌లో డీజిల్ సెస్ విధించారు. దీంతో ప్రయాణికులపై ఏడాదికి రూ.720 కోట్ల మేర భారం పడింది.

మరోసారి ఎంత పెంచాలన్న దానిపై ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం జగన్ వద్దే కీలక సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎం ఆమోదం తెలపగానే కీలక ఉత్తర్వులు రానున్నాయి. డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నా..ఆర్టీసీ టికెట్ ధరలు పెంచకపోవడంతో సంస్థపై నష్టాల భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు.

ప్రతి నెలా డీజిల్ ధరలకు అనుగుణంగా ఛార్జీలపై నిర్ణయం తీసుకునే విధానం తీసుకురావాలనే ఉద్దేశంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ధరల హెచ్చు తగ్గులను బట్టి నెలలో సగటు ధర ఎంతో ఉందో నిర్ణయిస్తామని అంటున్నారు. దాని ఆధారంగా నెలలో ఛార్జీలను సవరిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

Also read: Weight Lose Tips: 30లో బరువు తగ్గాలనుకుంటున్నారా.. సులభమైన ఈ 7 చిట్కాలు ఫాలో అయితే చాలు!

Also read: India vs South Africa: నేడు భారత్ ,సౌతాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్..మార్పులు చేర్పులు ఇవే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News