Reliance Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ ?
రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో కింగ్ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) నిగ్గు తేల్చగా.. అప్ లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
రిలయన్స్ జియో 4G ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో కింగ్ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) నిగ్గు తేల్చగా.. అప్ లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. నవంబర్‌లో 20.8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్ లోడింగ్ స్పీడ్ బాగా పనిచేసింది. అలాగే వొడాఫోన్ విషయానికొస్తే.. నవంబర్ నెలలో 6.5 ఎంబీపీఎస్ స్పీడుతో అప్ లోడింగ్ కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది.
డౌన్‌లోడింగ్ స్పీడులో తన ప్రత్యర్థి అయిన వొడాఫోన్‌తో పోల్చుకుంటే రెండు రెట్లు కంటే అధిక స్పీడుతో రిలయన్స్ జియో ( Reliance Jio ) దూసుకుపోయింది. వాస్తవానికి ఐడియా సెల్యూలార్, వొడాఫోన్ సంస్థలు ఒక్కటిగా మారి వొడాఫోన్ ఐడియాగా అవతరించినప్పటికీ.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం డేటా స్పీడ్ లెక్కింపు విషయంలో రెండింటినీ వేరువేరుగానే పరిగణిస్తోంది.
Also read : Jio 5G Service in India: జియో 5జీపై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
నవంబర్‌లో వొడాఫోన్ ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ స్పీడ్ 9.8 mbps గా నమోదు కాగా ఆ తర్వాత స్థానాల్లో 8.8 ఎంబీపీఎస్ స్పీడుతో ఐడియా, 8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారతి ఎయిర్‌టెల్ ( Airtel internet speed ) నిలిచాయి.
అప్ లోడింగ్ స్పీడులో 6.5 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌లో ( Vodafone uploading speed ) టాప్‌లో నిలవగా ఆ తర్వాత 5.8 ఎంబీపీఎస్ స్పీడుతో ఐడియా, 4 ఎంబీపీఎస్ స్పీడుతో ఎయిర్‌టెల్ ఉన్నాయి. డౌన్ లోడింగ్ స్పీడులో టాప్‌లో నిలిచిన రిలయన్స్ జియో.. అప్ లోడింగ్ స్పీడులో ( Jio internet speed ) మాత్రం 3.7 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్, ఐడియా ( Idea internet speed ), ఎయిర్‌టెల్ లాంటి కాంపిటీటర్స్ కంటే ఎంతో వెనుకబడింది.
Also read : SBI account holders: ఖాతాదారులకు ఎస్బీఐ బ్యాంక్ హెచ్చరిక.. లైట్ తీసుకుంటే మీ ఖాతా ఖాళీ..
డౌన్ లోడింగ్ స్పీడ్ అంటే.. ఇంటర్నెట్‌లో ఏదైనా శోధించేటప్పుడు ఉండే వేగాన్ని డౌన్ లోడింగ్ స్పీడ్ అంటారు. అలాగే అప్ లోడింగ్ స్పీడ్ అంటే.. మీ సిస్టం నుంచి కానీ లేదా ఇంటర్నెట్ నుంచి కానీ ఏదైనా డేటాను ఇతరులతో పంచుకునే సమయంలో ఉండే ఇంటర్నెట్ వేగాన్నే అప్ లోడింగ్ స్పీడ్ అంటారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI ) మై స్పీడ్ అప్లికేషన్ అనే యాప్ ( My speed application ) ద్వారా దేశవ్యాప్తంగా రియల్ టైమ్ పద్ధతిలో ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్ స్పీడుని లెక్కిస్తుంది.
Also read : Debit Cards and credit cards data leaked: 70 లక్షల ATM cards, credit cards డేటా లీక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook