Mobile Recharge Tariff Hike: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ ఛార్జీలు పెంచేసింది. జూలై 3 తరువాత అంటే ఎల్లుండి నుంచి కొత్త టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి రానున్నాయి. అయితే మీ జేబుకు భారం కాకుండా పాత రీఛార్జ్ ప్లాన్‌తోనే రీఛార్జ్ చేసుకునే అవకాశం మిగిలింది. అంటే పెరిగిన ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. అదెలాగంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా వస్తువు ధర పెరుగుతుందంటే ముందుగా కొని స్టాక్ పెట్టుకుంటాం కదా అదే విధంగా పాత రీఛార్జ్ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకుని స్టాక్ ఉంచుకోవచ్చు. అంటే పెరిగిన టారిఫ్ నుంచి తప్పించుకోవచ్చు. జియో లేదా ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. మీరు ఇప్పటి వరకూ వాడిన రీఛార్జ్ ప్లానే ఏడాదికి సరిపడా తీసుకుని స్టాక్ ఉంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఏకంగా 600 రూపాయలు సేవ్ చేయవచ్చు. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్‌ను పరిశీలిస్తే ప్రతి ప్లాన్ ధర గణనీయంగా పెరిగిపోయింది. జియో 155 రూపాయల ప్లాన్ ఇప్పుడు 189 రూపాయలైంది. అదే విధంగా ఎయిర్‌టెల్ 299 రూపాయలు ప్లాన్ ఇప్పుడు 349 రూపాయలైంది. జూన్ 27న ఈ రెండు కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. కొత్త ధరలు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. 


జియో, ఎయిర్‌టెల్‌లు వార్షిక ప్లాన్ టారిఫ్ కూడా పెంచేశాయి. నిన్నటి వరకూ 2,999 రూపాయల వార్షిక ప్లాన్ జూలై 3 అంటే రేపట్నించి ఏకంగా 3599 రూపాయలు కానుంది. అంటే ఏకంగా 600 రూపాయలు పెరిగిపోయింది. ఈ ప్లాన్‌లో జియో రోజుకు 2.5 జీబీ డేటా ఇస్తుంటే ఎయిర్‌టెల్ రోజుకు 2 జీబీ డేటా ఇస్తోంది. అంటే ఈ ప్లాన్ వినియోగదారులకు ఇక ఏడాదికి 600 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. 


అదే సమయంలో రిలయన్స్ జియో కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ తొలగించింది. 84 రోజుల వ్యాలిడిటీతో 6జీబీ డేటాతో లభించే 395 రూపాయల ప్లాన్‌ను జియో తొలగించింది. అంటే రేపట్నించి ఇది అమల్లో ఉండదు. అదే ఇవాళ అదే ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే ఆ ప్లాన్ ఉంటుంది. ఇంకా 84 రోజులు ఈ ప్లాన్ ఎంజాయ్ చేయాలంటే ఇవాళ రీఛార్జ్ చేసుకోవచ్చు. 


జియో లేదా ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎవరైనా సరే ఇప్పటి వరకూ వినియోగించిన ప్లాన్‌ను రేపటిలోగా కొనుగోలు చేస్తే పనిచేస్తుంది. అంటే వార్షిక ప్లాన్ ఇవాళ రీఛార్జ్ చేస్తే మరో ఏడాది వరకూ పనికొస్తుంది. ఒకవేళ మీరు ప్రస్తుతం వాడుతున్న ప్లాన్ వ్యాలిడిటీ ఇంకా మిగిలున్నా ఆ తరువాత నుంచే మీరు ఇప్పుడు కొనుగోలు చేసే ప్లాన్ మొదలవుతుంది. అంటే ముందుగా స్టాక్ ఉంచుకోవడం. ఇప్పుడు కొని 3 నెలలు 6 నెలలు, 12 నెలలకు స్టాక్ ఉంచుకోవచ్చు. 2999 రూపాయల వార్షిక ప్లాన్ రేపటిలోగా కొనుగోలు చేస్తే పాత ధరకే వస్తుంది. తరువాత అయితే 3599 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే అదనంగా 600 రూపాయలు చెల్లించాలి. 


ఇలా కాకుండా ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్ వాడటం ద్వారా అదనంగా  10 రూపాయల్నించి 50 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. మీ ఫ్లిప్‌కార్ట్ ఎక్కౌంట్‌లో ఉన్న సూపర్ కాయిన్స్ ద్వారా ఆ లాభాన్ని పొందవచ్చు.


Also read: Pan Card: పాన్‌కార్డు పోయిందా, కొత్త డూప్లికేట్ పాన్‌కార్డు ఎలా తీసుకోవాలో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook