Pan Card: పాన్‌కార్డు పోయిందా, కొత్త డూప్లికేట్ పాన్‌కార్డు ఎలా తీసుకోవాలో తెలుసా

How to get Duplicate Pan Card: నిత్య జీవితంలో పాన్‌కార్డు అనేది చాలా అవసరం. బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్దిక లావాదేవీలు పాన్‌కార్డు లేకుండా జరగవు. ఒకవేళ మీ పాన్‌కార్డు డ్యామేజ్ అయినా లేక పోగొట్టుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్‌కార్డు చాలా సులభంగా పొందవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 2, 2024, 05:50 PM IST
Pan Card: పాన్‌కార్డు పోయిందా, కొత్త డూప్లికేట్ పాన్‌కార్డు ఎలా తీసుకోవాలో తెలుసా

How to get Duplicate Pan Card: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు , ఆర్ధిక లావాదేవీలకు పాన్‌కార్డు చాలా అవసరం. పాన్‌కార్డును ఇటీవలి కాలంలో గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తున్నారు. రానున్న రోజుల్లో పాన్‌కార్డు ప్రాముఖ్యత మరింతగా పెరగనుంది. అంత ముఖ్యమైన పాన్‌కార్డు ఒకవేళ పోగొట్టుకున్నా చింతించాల్సిన పనిలేదు. చాలా సులభంగా డూప్లికేట్ పాన్‌కార్డును తీసుకోవచ్చు. అదెలాగో చూద్దాం

పాన్‌కార్డు డూప్లికేట్ పొందేందుకు ముందుగా National Securities Depository limited NSDL లేదా  UTI Infrastructure technology and services limited UTIITSL పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు రిక్వస్ట్ ఫర్ న్యూ పాన్‌కార్డ్ లేదా ఛేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్‌ డేటా ఫిల్ చేయాలి. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, పాన్ నెంర్ వివరాలు భర్తీ చేయాలి. 

ఇప్పుడు ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు అప్‌లోడ్ చేయాలి. ఇవి ఐడీ ప్రూఫ్ , అడ్రస్ ప్రూఫ్ కోసం పనికొస్తాయి. డూప్లికేట్ పాన్‌కార్డు కోసం నామినల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్ పూర్తిగా నింపి సబ్మిట్ చేశాక మీకొక రిసీప్ట్ వస్తుంది. ఈ రిసీప్ట్ ఆధారంగా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు పాన్ నెంబర్ కచ్చితంగా అవసరమౌతుంది. మీరు సమర్పించిన వివరాలు వెరిఫై చేసేందుకు పాన్‌కార్డు ఉపయోగపడుతుంది. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పాన్‌కార్డు చాలా అవసరం. మీ ఆర్ధిక కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయో లేవా అనేది పాన్‌కార్డు ధృవీకరిస్తుంది. ఐటీ రిఫండ్ కోసం కూడా పాన్‌కార్డు అవసరం ఉంటుంది. మీరు ఒకవేళ పాన్‌కార్డు పోగొట్టుకుంటే కొత్త పాన్‌కార్డు పొందవచ్చు.

Also read: Income Tax Saving Tips: ఇలా చేస్తే ఏకంగా 1 లక్షా 80 వేలు ట్యాక్స్ సేవ్ చేయవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News