Jio New Recharge Plans: కస్టమర్లను నిలబెట్టుకునేందుకు, కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే 200 రూపాయల్లోపు రెండు రీఛార్డ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ సామాన్యులకు కూడా అనుకూలంగా ఉండనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో కొత్తగా రెండు రీఛార్డ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఇవి 200 రూపాయల్లోపే ఉండటం విశేషం. ఇందులో ఒకటి జియో 198 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. అన్‌లిమిటెడ్ 5జి డేటా లభిస్తుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు అందుతాయి.


మరో ప్లాన్ జియో 189 రీఛార్జ్ ప్లాన్. 199 రూపాయలకు బదులు 189 రూపాయల ప్లాన్ బెస్ట్ ఉంటుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. అన్నింటికీ మించి ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ప్రస్తుతం జియో అందిస్తున్న వివిధ ప్లాన్స్‌లో ఇది బెస్ట్ ప్లాన్ కావచ్చు. 


రిలయన్స్ జియో 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఇది 18 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందవచ్చు. తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్స్ పొందాలంటే ఇవే బెస్ట్. రిలయన్స్ జియో 198 రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుతం ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.


Also read: Amazon Laptop Offers: అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు, టాప్ 5 చీప్ అండ్ బెస్ట్ ల్యాప్‌టాప్‌లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook