Jio Plan 91 Benefits: రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రకటిస్తోంది. ఇప్పుడు ప్రకటించిన మరో ప్లాన్ ధర 100 రూపాయల కంటే తక్కువే. అంత తక్కువ ధరకు ప్రయోజనాలు మాత్రం అధికంగా అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని టెలికం కంపెనీలన్నింటిలో అతి పెద్దది రిలయన్స్ జియో. జియో కస్టమర్లకోసం అద్భుతమైన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇవాళ మేం చెప్పే మరో ప్లాన్ చాలా ప్రత్యేకమైంది. 3 జీబీ డేటాతో పాటు ఓటీటీ సభ్యత్వం కూడా లభిస్తోంది ఈ ప్లాన్‌తో. అలాగని ధర ఎక్కువేం కాదు. వంద రూపాయల కంటే తక్కువే. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..


రిలయన్స్ జియో ప్లాన్ 91


రిలయన్స్ జియో 91 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇందులో చాలా ప్రయోజనాలున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు 3 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. దాంతోపాటు ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 50 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అంతేకాకుండా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్ సభ్యత్వం ఉచితం. 


ఈ ప్లాన్ అందరు యూజర్లకు వర్తించదు. జియో ఫోన్ వినియోగించేవారికే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో తెలిపింది. 


Also read: Multibagger Stock: 15 ఏళ్ల క్రితం 3 వందలున్నషేరు, ఇప్పుడు 50 వేలు, ఎన్ని రెట్ల లాభమో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok