Reliance Jio Special Offer: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇండియన్ మార్కెట్‌లో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కస్టమర్స్ కోసం జియో బంపరాఫర్  ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 11 వరకు జియో రీఛార్జ్ ప్లాన్స్‌పై రూ.10 లక్షలు విలువ చేసే బహుమతులు గెలుచుకోవచ్చు. రూ.299 నుంచి మొదలయ్యే అన్నిరీఛార్జ్ ప్లాన్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఒక్క తమిళనాడులో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్ట్ పెయిడ్ కస్టమర్స్‌కు వర్తిస్తుందా?


ఈ ఆఫర్ ద్వారా ప్రతీరోజూ రూ.10 లక్షల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే వీటికి కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. అయితే ఆ షరతులు ఏవనేది వెల్లడించలేదు. బహుశా ఈ ఆఫర్ పోస్ట్ పెయిడ్ యూజర్స్‌కి వర్తించకపోవచ్చు. ప్రీపెయిడ్ యూజర్స్ ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే.. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 11 మధ్య మరొకసారి రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. ప్రస్తుతం యాక్టివేషన్‌లో ఉన్న రీఛార్జ్ ప్లాన్ ముగిశాకే కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. 


రూ.2999 రీఛార్జ్ ప్లాన్‌పై జియో ఆఫర్ :


జియో ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే రూ.2999 ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా 365 రోజులు రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అంటే ఏడాదికి 912.5 జీబీ డేటా పొందుతారు. రోజువారీ డేటా పరిమితి 2జీబీ దాటినట్లయితే ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కి తగ్గుతుంది. ఈ ఆఫర్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రూ.499 విలువ చేసే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వన్ ఇయర్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. అలాగే, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ యాప్స్‌కి యాక్సెస్ పొందుతారు. Ajio, రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందుతారు.


Also Read: Telangana Rain Alert: తెలంగాణకు అలర్ట్.. రెండు రోజులు అతి భారీ వర్షాలు.. రేపు బంగాళాఖాతంలో అల్ప పీడనం 


Also Read: MLA Jagga Reddy:ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ లో కలవరం   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook