Telangana Rain Alert: తెలంగాణకు అలర్ట్.. రెండు రోజులు అతి భారీ వర్షాలు.. రేపు బంగాళాఖాతంలో అల్ప పీడనం

Telangana Rain Alert: తెలంగాణలో మరోసారి హెచ్చిరక జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయే రెండు రోజుల పాటు అతి భారీ వర్ష సూచన చేసింది.

Written by - Srisailam | Last Updated : Sep 7, 2022, 03:21 PM IST
  • తెలంగాణలో భారీ వర్షాలు
  • రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
  • మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Telangana Rain Alert: తెలంగాణకు అలర్ట్.. రెండు రోజులు అతి భారీ వర్షాలు.. రేపు బంగాళాఖాతంలో అల్ప పీడనం

Telangana Rain Alert: తెలంగాణలో మరోసారి హెచ్చిరక జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయే రెండు రోజుల పాటు అతి భారీ వర్ష సూచన చేసింది. ఛత్తీస్ గఢ్ పరిసరాల్లో ఉన్న  ఉత్తర దక్షిణ ద్రోని బుధవారం ఉదయం బలహీన పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు  పరిసర ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో  ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం సగటు సముద్ర  మట్టం నుండి 5.8 కిమీ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఇక ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర  మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఆవర్తనము ప్రభావంతో రాగల 24 గంట్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

రాగల మూడు రోజులు తెలంగాణకు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ వెల్లడించింది. గురువారం ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లా అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్ , సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇక శుక్రవారం మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతి భారీ నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖ్మమం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగితా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రేపటి  నుండి మూడు రోజుల పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. 

Read also: MLA Jagga Reddy:ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ లో కలవరం   

Read also: నిఖిల్‌కు నితిన్‌కు ఆ మాత్రం తేడా కూడా తెలియట్లేదా నాయనా.. బీజేపీ లీడర్లను ఆటాడుకుంటున్న నెటిజన్లు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x