Best Prepaid Jio Plans: ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ పరిచయం చేసిన ఘనత రిలయన్స్ జియోకు దక్కింది. రోజువారీ డేటా, మంత్లీ, యాన్యువల్ డేటాల్ని అందిస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా రెండు ఆఫర్లు ప్రకటించింది. ఇక నెల నెలా రీఛార్జ్ అవసరం కూడా ఉండదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో డేటా వినిమయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ డేటాతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకొంతమంది మొబైల్ డేటాపై ఆధారపడుతున్నారు. టెలీకం రంగంలో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు పోటీగా రిలయన్స్ జియో తనదైన ముద్ర వేసింది. టెలీకం కంపెనీల్లో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన కంపెనీగా అవతరించింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. అదే విధంగా రోజుకు 2.5 జీబీ డేటా అందిస్తూ నెల నెలా రీఛార్జ్ చేయించుకునే అవసరం లేకుండా కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. రోజుకు 1 జీబీ, 1.5 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ అందుబాటులో ఉన్నా అవి ఎటూ సరిపోవడం లేదు. అందుకే రోజుకు 2.5 జీబీ డేటా అందించే సరికొత్త ప్లాన్స్ ప్ర‌వేశపెట్టింది రిలయన్స్ జియో.


రిలయన్స్ జియో 2,999 ప్లాన్


2999 ప్రీ పెయిడ్ ప్లాన్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. అంటే ఏడాది మొత్తం వర్తిస్తుంది. 365 రోజులకు అదనంగా మరో 23 రోజులు ఈ ప్లాన్ పనిచేస్తుంది. ఇందులో రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటాతో పాటు అదనంగా 75 జీబీ బోనస్ డేటా ఉంటుంది. ఏ నెట్‌వర్క్ కైనా సరే అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీలు ఉచితంగా అందుతాయి.


రిలయన్స్ జియో 2,023 ప్లాన్


ఇది కూడా ఓ దీర్ఘకాలిక ప్లాన్. అయితే ఇది 365 రోజులకు కాకుండా 252 రోజులకు వర్తిస్తుంది. రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అపరిమితమైన వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుతాయి. వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ ఫీచర్లు ఉచితం. 


రిలయన్స్ జియో 899 ప్లాన్


ఈ ప్లాన్ మిడ్ రేంజ్ ప్రీ పెయిడ్ ప్లాన్. ఇది 90 రోజుల చెల్లుబాటులో వర్తిస్తుంది. రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమితమైన వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా అందుతాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ యాప్స్ ఉచితంగా అందుతాయి.


రిలయన్స్ జియో 349 ప్లాన్


ఇది స్వల్పకాలిక ప్రీపెయిడ్ ప్లాన్. రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమితమైన వాయిస్ కాలింగ్ వర్తిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుతాయి. 30 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ ఫీచర్లు ఉచితంగా అందుతాయి.


Also read: Trai New Rules: ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్, మెస్సేజెస్‌కు చెక్, ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook