Future Group: దేశంలోని ఆ కంపెనీ వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయుంది. ఈ కంపెనీనీ కొనేందుకు ఆసియాలోనే కుబేరులైన ఆ ఇద్దరు పారిశ్రామిక వేత్తలు సహా ఇతర దిగ్గజ కంపెనీలు పోటీ పడుతుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. అసలా కంపెనీ కధాకమామీషు ఏంటో చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలోని దిగ్గజ కంపెనీలు రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్, డబ్ల్యూహెచ్ స్మిత్, జిందాల్ పవర్ లిమిటెడ్, గార్డెన్ బ్రదర్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఓ కంపెనీ వేలం కోసం త్వరలో పోటీ పడనున్నాయి. వ్యాపార జగత్తులో ఇండియాలోని టాప్ టూ టైకూన్స్ మధ్య వేలంలో పోటాపోటీ దర్శనమివ్వనుంది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ముకేష్ అంబానీ ఆసియాలో అందరికంటే ధనికుడిగా ఉన్నారు. ఈ వేలంలో అతనికి పోటీగా ఆసియా ఖండపు మాజీ కుబేరుడు గౌతమ్ అదానీ ఉంటారు.


వేలానికి సిద్ధమైన ఆ కంపెనీ బిగ్ బజార్‌కు చెందిన ఫ్యూచర్ రిటైల్ కంపెనీ. వాస్తవానికి గత ఏడాదే బిగ్ బజార్ కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. కానీ డీల్ కుదరలేదు. ఇప్పుడు మరోసారి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమౌతుంది. త్వరలో ఈ కంపెనీని కొనే ప్రక్రియలో భాగంగా రిలయన్స్, అదానీ గ్రూప్ ఒకదానికొకటి తలపడే అవకాశాలున్నాయి. అదానీ, అంబానీలతో పాటు 47 ఇతర కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ప్రభావం ఆయా కంపెనీల షేర్లపై కూడా కన్పిస్తోంది. ఫ్యూచర్ రిటైల్ కంపెనీ షేర్ 2.50 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఇది 4.17 శాతం అధికం కావడం గమనార్హం.


రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్‌తో పాటు డబ్ల్యూహెచ్ స్మిత్, జిందాల్ పవర్ లిమిటెడ్, గార్డెన్ బ్రదర్స్ వంటి ఇతర కంపెనీలు కూడా బిగ్ బజార్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలోనే వ్యాపార జగత్తులో ఇండియాకు చెందిన రెండు దిగ్గజాల మధ్య పోటీ ఆసక్తిగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.


ఏప్రిల్ 7వ తేదీన ఫ్యూచర్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లభించింది. ఒకప్పుడు ఇండియాలో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ రంగంలో రెండవస్థానంలో ఉన్న కంపెనీ. ఈ కంపెనీపై ప్రస్తుతం 21 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఈ కంపెనీ పరిస్థితి దారుణంగా మారింది. అప్పులు చెల్లించలేకపోతే దివాళా ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. 


Also read: Unclaimed Deposits: ఆర్బీఐలో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎంతో తెలుసా, కుటుంబసభ్యులకు కూడా దక్కదా


రిలయన్స్ ఇండస్ట్రీస్ 24,71 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత ఈ ప్రతిపాదన రద్దయింది. కంపెనీ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇదే ఏడాది జనవరి 23న ఫార్చ్యూనర్ కంపెనీ అధినేత కిశోర్ బయానీ తన పదవికి రాజీనామా చేశారు. మార్చ్ 10న రాజీనామా వాపసు తీసుకున్నారు. ఆ తరువాతే ఫ్యూచర్ కంపెనీని కొనేందుకు ఆసక్తి పెరిగింది. మరి ఏ కంపెనీ హస్తగతం చేసుకుంటుందో చూడాలి.


Also read: Vande Bharat Trains: త్వరలో తెలంగాణకు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎక్కడి నుంచి ఎక్కడి కంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook