Rs 2,000 Notes Latest News: ముంబై: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే, రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ పరిమితి విధించింది. రోజుకు ఒక్కరికి 10 నోట్లు మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు 100 రోజులు పని దినాలుగా ఉండగా.. అలా రోజుకు 20 వేల చొప్పున ఈ 100 రోజుల పాటు బ్యాంకులకు వెళ్లినా... రూ. 20 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును మార్చుకోలేరు. ఒకవేళ మార్చుకున్నా.. ఆదాయ పన్ను శాఖ వారు అడిగితే ప్రతీ రూపాయికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. అందుకే లెక్కకు మించి రూ. 2 వేల నోట్ల కట్టలు ఉన్న బడాబాబులు వాటిని వివిధ రూపాల్లో ఖర్చుచేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజు వారీ నిత్యావసర వస్తువులు కొనుగోలు
రూ. 2 వేల నోట్లను ఎలా మార్చుకోవాలో అర్థం కాని జనం ఇంట్లోకి అవసరమైన నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ ఆ డబ్బులను ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా రూ. 2 వేల నోట్లను వదిలించుకోవడంతో పాటు ఇంట్లోకి నిత్యావసరాలు కూడా తీసుకోవచ్చు అనేది వారి ప్లాన్. 


బ్రాండెడ్ వస్తువుల కొనుగోలు
ఇంకొంతమంది ఆ రూ. 2,000 నోట్లను మార్చుకోకుండానే వాటిని ఖర్చు చేయడం కోసం ఖరీదైన వస్తువులు, బ్రాండెడ్ గూడ్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు. 


మామిడి పండ్ల నుంచి స్మార్ట్ వాచ్‌ల వరకు
ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లు కొనుగోలు చేయడం నుంచి మొదలుపెట్టి లగ్జరీ వాచ్‌ల షాపింగ్ వరకు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లనే ఉపయోగిస్తున్నారు. 


ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్‌లో మహ్మద్ అజార్ అనే మామిడి పండ్ల వ్యాపారి రాయిటర్స్‌తో మాట్లాడుతూ శనివారం నుండి చాలా మంది మామిడి పండ్లు కొనుగోలు చేయడానికి వచ్చి 2,000 రూపాయల నోట్లను చెల్లిస్తున్నారు అని తెలిపారు. అలా నిత్యం తనకు 8 నుంచి 10 నోట్లు వస్తున్నాయని, మరో మార్గం లేకపోవడంతో వాటిని తీసుకుంటున్నానను అని చెప్పిన అజార్.. సెప్టెంబర్ 30లోపు అన్నింటినీ ఒకేసారి తన ఖాతాలో డిపాజిట్ చేస్తానని స్పష్టంచేశారు.


ముంబైలోని రాడో స్టోర్‌ మేనేజర్ మైఖేల్ మార్టిస్ కూడా ఇదే అంశంపై లైవ్ మింట్‌తో మాట్లాడుతూ.. తమ స్టోర్లో స్మార్ట్ వాచ్ అమ్మకాలు పెరిగాయని.. చాలా మంది రూ. 2 వేల నోటుతోనే చెల్లింపులు చేస్తున్నారు అని అన్నారు. 


ఇది కూడా చదవండి : RBI About 2,000 Notes: 2 వేల నోటు మార్పిడి, గడువుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు


దేవాలయాలకు పెరుగుతున్న విరాళాలు
కొంత మంది ఆలయాల్లో రూ.2000 నోట్లను విరాళంగా హుండిలలో కానుకల రూపంలో సమర్పించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని జ్వాలా దేవి ఆలయంలో హుండిల్లో 2,000 రూపాయల నోట్లు 400 వరకు వచ్చాయని గుర్తించినట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.


ఇది కూడా చదవండి : RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?


ఇది కూడా చదవండి : Can we Accept Rs 2000 Notes: రూ. 2000 నోటు తీసుకుంటే సమస్య తప్పదా ? ఏంటా సమస్య ?


ఇది కూడా చదవండి : Rs 2000 Notes Why and What: ఆర్బీఐ రూ. 2000 నోటును ఎందుకు ఉపసంహరించుకుందో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK