RBI About 2,000 Notes: నగదు చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2016 లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సందర్భంలో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన కరెన్సీ నోట్ల లోటును పూడ్చేందుకు అతి తక్కువ వ్యవధిలో రూ. 2000 నోట్లను తీసుకొచ్చాం. కానీ అప్పుడు చలామణిలోకి తీసుకొచ్చిన రూ. 2000 నోట్లలో ఇప్పుడు కేవలం 50 శాతం కంటే తక్కువ నోట్లే చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాసు స్పష్టంచేశారు.
రూ. 2000 నోట్ల డిపాజిట్, మార్పిడి విషయంలో సెప్టెంబర్ 30వ తేదీ డెడ్ లైన్ గురించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. నోట్ల మార్పిడి గురించి బ్యాంకుల్లో రద్దీ ఉంటుంది అని అనుకోవడం లేదని.. జనం కూడా నోట్ల మార్పిడి గురించి బ్యాంకులకు త్వరపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు అని సూచించారు. సెప్టెంబర్ 30వ తేదీనే తుది గడువు అవుతుందా లేక పొడిగించడం జరుగుతుందా అనే ప్రశ్నకు శక్తికాంత దాస్ స్పందిస్తూ.. అప్పటి పరిస్థితిని సమీక్షించి ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.
2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్‌బీఐ.. ఇది డీమానిటైజేషన్ కాదని, నోట్ల మార్పిడి మాత్రమే అని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలు 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. ఒక్కొక్కరు రోజుకు 10 నోట్లు మాత్రమే మార్చుకోవడానికి వీలు ఉంది. 2 వేల నోట్లు మార్చుకోవడానికి బ్యాంక్ ఖాతాదారులే అయ్యుండాల్సిన అవసరం లేదు అని ఆర్బీఐ తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి : RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?
మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోగా 131 రోజుల సమయం ఉంటున్నప్పటికీ.. అందులో వారాంతపు సెలవులు, పండగలు, ఇతర సెలవు దినాలు అన్నీ కలిపి 31 రోజులు బ్యాంకులు పనిచేసే అవకాశం లేదు. అంటే బ్యాంకు పని దినాలు 100 రోజులే కానున్నాయి. ఈ లెక్కన 100 రోజుల్లో రోజుకు 20 వేల చొప్పున 20 లక్షల వరకు మాత్రమే నోట్లు మార్చుకునేందుకు వీలు ఉంది. ఒకవేళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పినట్టుగా సెప్టెంబర్ 30 నాటికి అప్పుడు ఉండే పరిస్థితులకు అనుగుణంగా తుది గడువును పొడిగించినట్టయితే.. ఇంకొన్ని రోజులు సమయం లభించినట్టు అవుతుంది.
ఇది కూడా చదవండి : FAQs About Rs 2000 Note: 2000 నోటు ఎప్పటివరకు చెల్లుతుంది ? ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చా ?
ఇది కూడా చదవండి : Can we Accept Rs 2000 Notes: రూ. 2000 నోటు తీసుకుంటే సమస్య తప్పదా ? ఏంటా సమస్య ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK