Samsung Galaxy S22 Feauters: నూతన సంవత్సరంలో పలు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో సౌత్ కొరియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి వస్తున్న  S22 సిరీస్ ఒకటి. త్వరలోనే ఈ సిరీస్ మార్కెట్‌లోకి లాంచ్ అవనుంది. గెలాక్సీ S21 అల్ట్రా సిరీస్‌తో పోలిస్తే S22 అల్ట్రా సిరీస్‌లో మరింత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ యూజర్స్‌కి అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ అందిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

S22 అల్ట్రా సిరీస్‌లో ఉండే లెన్స్‌ అద్భుతమైన క్వాలిటీతో పనిచేస్తాయి. S21తో పోలిస్తే  కెమెరా షేక్ అయ్యే అవకాశం నాలుగు రెట్లు తక్కువగా ఉంటుంది. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో కూడిన OIS (Optical image stabilization) వైడ్ షిఫ్ట్ ఫీచర్‌తో వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. 


కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ S21 అల్ట్రా OIS పరంగా టాప్‌లో ఉంది. త్వరలో అందుబాటులోకి రాబోయే S22 సిరీస్ OIS పరంగా మరింత మెరుగ్గా ఉంటుందని... ఒకరకంగా పాత రికార్డులన్నింటినీ అది బద్దలు కొడుతుందని చెబుతున్నారు. ఇందులో ఉండే 'AI picture quality enhancement mode' ఫీచర్ ద్వారా 108MP ఇమేజెస్ అత్యంత క్వాలిటీగా వస్తాయి.


S22 సిరీస్‌‌లో 108MP ISOCELL HM3 ఫీచర్‌తో కూడిన క్వాడ్-కెమెరా  ప్రైమరీ కెమెరా పనితీరు అద్భుతంగా ఉంటుంది. 12 MP అల్ట్రావైడ్ సెన్సార్‌... 3x,10x జూమ్ కెపాసిటీతో రెండు 10MP సోనీ టెలిఫోటో సెన్సార్‌లను కలిగి ఉండొచ్చునని చెబుతున్నారు. ఈ ఫోన్‌లో 40MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు.


ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S21 FE సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో కూడిన ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. లావెండర్, వైట్, గ్రాఫైట్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మార్కెట్‌లో (Smart Phones in India) ఈ ఫోన్ ధర సుమారుగా రూ.52,031గా ఉంది. డేటా స్టోరేజీ పరంగా మూడు వేరియంట్స్ 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB అందుబాటులో ఉన్నాయి.


Also Read: O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి