Samsung Galaxy Z Flip: రూ.96,000 విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ.36 వేలకే కొనేయండి!
Samsung Galaxy Z Flip: శాంసంగ్ కంపెనీ గతేడాది ప్రవేశపెట్టిన Samsung Galaxy Z Fold 3 5G స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో రూ. 95,999 ధరకు విక్రయిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 35,999 కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Samsung Galaxy Z Flip: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి సరికొత్త వేరియంట్ గతేడాది ఆగస్టులో భారత విపణిలోకి అందుబాటులోకి వచ్చింది. Samsung Galaxy Z Fold 3 5G పేరుతో స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. దీంతో పాటు సదరు స్మార్ట్ ఫోన్స్ పై బ్యాంకు ఆఫర్లతో కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అందులో ICICI, SBI, HDFC వంటి బ్యాంకులు ఈ వేరియంట్ పై ప్రత్యేక డిస్కౌంట్స్ ఉన్నాయి. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ బోనస్ కూడా కొనుగోలు దారునికి లభిస్తుంది.
Samsung Galaxy Z Flip 3 ఆఫర్లు
శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో రూ. 95,999 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ పై శాంసంగ్ వెబ్ సైట్ లో రూ. 11 వేల తగ్గింపును పొందవచ్చు. దీంతో రూ. 84,999 ధరకు చేరుతుంది. ICICI, SBI బ్యాంకు ఆఫర్ల ద్వారా అత్యధికంగా రూ. 7 వేలు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. లేదా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు యూజ్ చేయడం ద్వారా రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 77,999 లేదా రూ. 79,999 ధరకే అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు శాంసంగ్ అప్ గ్రేడ్ బోనస్ అత్యధికంగా రూ. 10 వేలు తగ్గింపు వస్తుంది. అయితే అప్ గ్రేడ్ చేసే ప్రక్రియలో మరో రూ. 7 వేలు అదనంగా పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ తర్వాత శాంసంగ్ స్మార్ట్ ఫోన్ రూ. 60,999 కు చేరుతుంది.
దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అత్యధికంగా రూ. 25,000 పొందే అవకాశం ఉంది. అయితే అది మీ ఫోన్ కండిషన్ ఆధారంగా అంత మొత్తం డిస్కౌంట్ ను మీరు పొందుతారు. దీంతో శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ ను మీరు రూ. 35,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ - కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తున్నాయి.
Samsung Galaxy Z Fold 3 ఫీచర్లు
1) స్టోరేజ్ - 8GB RAM + 128GB
2) కలర్స్ - ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, లావెండర్.
3) మెయిన్ స్క్రీన్ - 6.7 Inch డైనమిక్ ఆల్మాండ్ 2X (2640 x 1080 పిక్సెల్స్)
4) కవర్ స్క్రీన్ - 1.9 Inch ఆల్మాండ్ (260 x 512 పిక్సెల్స్)
5) ప్రాసెసర్ - క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 888 (ఆక్టా కోర్)
6) రేర్ కెమెరాలు - 12MP Wide
12MP Ultra wide
12MP Telephoto
7) ఫ్రంట్ కెమెరా - 10MP Front Cover (HID)
8) 4MP Front Main (UDC)
9) బ్యాటరీ బ్యాకప్ - 4,400 mAh.
Also Read: Flipkart Symphony Cooler: ఏసీలా గోడకు ఫిట్ చేసుకునే కూలర్.. కేవలం రూ.12,824 మాత్రమే!
Also Read: BSNL Recharge Plan: BSNL బంపర్ ఆఫర్.. రూ.197 రీఛార్జ్ తో 100 రోజుల వ్యాలిడిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook