కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది. కోవిడ్19 నిబంధనలు పాటించకపోతే సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారిని నియంత్రించడం కష్టమవుతుంది. గత ఏడాది నుంచి చెల్లింపులు అధికంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నేరుగా నగదు ఇవ్వడానికి బదులుగా డిజిటల్ పేమెంట్ చేయాలని, తద్వారా కరెన్సీ ద్వారా కరోనా సోకే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చునని సూచిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిజిటల్ పేమెంట్స్ చేయడాన్ని అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు తమ అతి తెలివి ప్రదర్శిస్తుంటారని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. క్యూ ఆర్ కోడ్ కనిపిస్తే ఎక్కడపడితే అక్కడ స్కాన్ చేయకూడదని అది సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందని ఖాతాదారులకు ఎస్‌బీఐ పలు సూచనలు చేసింది. ఈ మేరకు ట్వీట్ ద్వారా తమ బ్యాంక్ ఖాతారులను అప్రమత్తం చేసింది.


Also Read: Twitter Features: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్, నగదు సంపాదించండి



‘క్యూఆర్ కోడ్(QR Code) స్కాన్ చేస్తే మీకు నగదు రాదు. మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయిందని మెసేజ్ వస్తుంది. అందుకే మీరు బిల్లులు చెల్లించే సందర్భంలో మాత్రమే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఎక్కడపడితే అక్కడ క్యూఆర్ కోడ్ కనిపించినా, ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా పంపినా స్కాన్ చేయకూడదు. సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ఇలాంటి ట్రిక్స్ చేస్తుంటారు. ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలంటూ’ ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. 


మీ బ్యాంకు ఖాతాలో నగదు ఎలా ఖాళీ అవుతుందనే విషయాన్ని సైతం వీడియో రూపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే బ్యాంక్ ఖాతాలో నగదును సైబర్ నేరగాళ్లు ఎలా లాగేస్తోరో తన ఖాతాదారులకు ఆ వీడియో ద్వారా ఎస్‌బీఐ సిబ్బంది అవగాహన కల్పించే ప్రయతం చేసింది.


Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook