SBI Alert: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్​బీఐ ఖాతా దారులకు అలర్ట్​. ఇటీవల జరిగిన బ్యాంక్ మోసాలను వివరిస్తూ.. కస్టమర్లు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించింది. తాజాగా సైబర్ మోసాగాల్లు కొత్త కొత్త మార్గాల్లో.. కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేస్తున్నారని అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా కస్టమర్లందరికీ కీలక సూచనలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోసాలు ఎలా జరుగుతున్నాయి?


ఇటీవల ఓటీపీలు కనుక్కుని మోసాలు చేసే నేరగాళ్ల గురించి జనాల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు సైబర్​ మోసగాళ్లు. ఇందుకోస బ్యాంక్ కస్టమర్లకు ఎస్​బీఐ నుంచి చేసినట్లుగా ఎస్​ఎంఎస్​లు పంపిస్తున్నారు.
అచ్చం ఎస్​బీఐ నుంచి వచ్చినట్లుగానే ఈ ఎస్​ఎంఎస్​లు ఉంటాయని. అందులో మీ కేవైసి వివరాలు అప్​డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని ఉంటోంది.


ఆ ఎస్​ఎంఎస్​ నిజమైందని నమ్మి ఆ లింక్​పై క్లిక్​ చేస్తే.. అందుల ఓ పేజీకి తీసుకెళ్తుంది. ఆ వ్యక్తిగత వివరాలన్నీ కోరుతుంది. వాటన్నింటిని ఎంటర్​ చేసి.. ఓటీపీ వెరిఫికేషన్ వంటివి పూర్తి చేస్తే.. అంతే సంగతులు. ఆ వివరాలన్నింటితో సైబర్ నేరగాళ్లు.. ఆయా వ్యక్తుల బ్యాంక్​ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.


ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్న బ్యాంక్ కస్టమర్లు.. తమ ఖాతాలో డబ్బు పోయిందని గ్రహిస్తున్నారు.


అయిత ఆలాంటి ఎస్​ఎంఎస్​ల పట్ల జాగ్రత్తగా ఉండాలన ఎస్​బీఐ తాజా ట్వీట్​లో కస్టమర్లకు సూచించింది. ఎస్​బీఐ ఎప్పుడు కూడా కేవైసీ అప్​డేట్​ చేయాలని లింక్​లు పంపదని స్పష్టం చేసింది. అలాంటి ఎస్​ఎంఎస్​లు వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లో వాటిని క్లిక్ చేయొద్దని సూచించింది. అలాంటి ఎస్​ఎంఎస్​లు మళ్లీ మళ్లీ వస్తుంటే.. సైబర్​ క్రైమ్​ పోలీసులకు తెలపాలని సలహా ఇచ్చింది.



Also read: Railway Tickets: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కోసం ఇకపై క్యూ లైన్ అవసరం లేదు!


Also read: LIC IPO: ఎల్​ఐసీ ఐపీఓ వాయిదా.. వచ్చే వారమే అధికారిక ప్రకటన?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook