LIC IPO: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓకు మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం గత కొంత కాలంగా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం ఐపీఓకు వచ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులన్నీ పూర్తి చేసింది. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్ట్ ఆఫ్ ఇండియా (సెబి)కి ఈ మేరకు దరఖాస్తు చేసుకోగా.. ఇందుకు ఆమోదం కూడా లభించింది.
తేదీని ప్రకటించకపోయినా.. మార్చిలో ఐపీఓ ఫిక్స్ అనేది తెలిసింది. అయితే అన్ని సజావుగా సాగుతున్నాయనుకునేలోపే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రూపంలో అనుకోని సమస్య వచ్చి పండింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దాదాపు 10 రోజులుగా దేశీయ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ వస్తున్నాయి. రష్యన్ మార్కెట్లు ఏకంగా తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ నేడు 769 పాయింట్లు కోల్పోయి.. 54,333 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ-నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 16,245 వద్ద ముగిసింది.
ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నెలలో ఎల్ఐసీని ఐపీఓకు తెచ్చే ప్లాన్‌ను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. చాలా మంది ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపఫథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ ఐపీఓను వాయిదా వేసినట్లు సమాచారం. దీనిపై వచ్చే వారం అధికారిక ప్రకటన రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎల్ఐసీ ఐపీఓ గురించి..
ప్రభుత్వం ఆదాయపు అంచనాల్లో భాగంగా ఎల్ఐసీలో 5 వాటాను ఐపీఓకు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. మొత్తం దాదాపు రూ.60 వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇది పూర్తయితే దేశంలో అతి పెద్ద ఐపీఓ కానుంది.
Also read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ హిట్టు సినిమాల్లో రీమేక్‌లే ఎక్కువట!
Also read: OPPO A74 Amazon: రూ.3 వేలకే OPPO 5జీ స్మార్ట్ ఫోన్.. ఈ ఒక్కరోజు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook