SBI Good News: తక్కువ వడ్డీకే లోన్.. ఎస్బీఐ పండుగ ఆఫర్లు.. త్వరపడండి!
స్టేట్ బ్యాంక్ ఇండియా జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, 7.15 శాతం వడ్డీ రేటుతో ఇస్తున్న గృహ రుణాలను పండుగ ఆఫర్ల సందర్భంగా 6.7% కే రుణాలను అందించనుంది. మరెందుకు ఆలస్యం త్వరపడండి.
SBI Home Loan Rate Cut: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank India) గృహ రుణాలకు సంబంధించి పెద్ద ప్రకటనను విడుదల చేసింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రుణ మొత్తంతో సంబంధం లేకుండా 6.7% చొప్పున క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్‌లను అందిస్తామని ఎస్‌బీఐ (SBI) ప్రకటించింది.
అందరికీ ఎస్‌బీఐ గృహ రుణాలు
స్టేట్ బ్యాంక్ జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, SBI ప్రస్తుతం 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలను (Home Loans) 7.15 శాతం వడ్డీ రేటుతో అందిస్తున్నాం. కానీ పండుగ ఆఫర్లను దృష్టిలో పెట్టుకొని, రూ .75 లక్షలకు పైగా గృహ రుణాలు తీసుకునే రుణగ్రహీతలు అతి తక్కువ వడ్డీరేటు 6.7% చొప్పున గృహ రుణాన్ని పొందవచ్చని తెలిపింది. పత్రికా ప్రకటన ప్రకారం, ఈ ఆఫర్ కింద, రూ .75 లక్షల గృహ రుణాన్ని 30 సంవత్సరాలకు తీసుకునే రుణగ్రహీతలకు 0.45% వడ్డీ చొప్పున చౌక రుణం పొందుతారు, ఈ మొత్తం కాలంలో వారికి రూ .8 లక్షలకు (Save Rs.8 Lacks) పైగా ఆదా అవుతుందని తెలిపింది.
Also Read: Nusrat Jahan: తన బిడ్డకు తండ్రి ఎవరో రివీల్ చేసిన ఎంపీ, నటి నుస్రత్ జహాన్
సాలరీ లేని వారికి కూడా లోన్స్
ఎస్బీఐ గృహ రుణాలలో జాబ్ చేసే వారితో పోలిస్తే, జాబ్ చేయని వారికి వడ్డీ రేటు కంటే 0.15 శాతం ఎక్కువగా ఉండేది. కానీ పండుగ సంధర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ లలో ఇలాంటి వ్యత్యాసం తొలగించబదిందని తెలిపింది. కావున ఇప్పటి నుండి సంభావ్య గృహ రుణ రుణగ్రహీతల నుండి వ్యాపార-సంబంధిత వడ్డీ ప్రీమియం వసూలు చేయబడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) తెలిపింది. జాబ్ లేదా సాలరీ లేని వారికి 0.15 శాతం వడ్డీ ఆదా చేసుకోవచ్చని తెలిపింది.
మినహాంచబడిన SBI ప్రాసెసింగ్ ఫీజు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మినహాయించిందని మరియు రుణగ్రహీత యొక్క క్రెడిట్ స్కోరు ఆధారంగా రాయితీ రేటుతో ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తున్నామని తెలిపింది. ఈ సారి అందరిని కలుపుకొని వెళ్లే విధంగా రుణగ్రహీత యొక్క వృత్తితో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని, మంచి అఫర్లను తీసుకొచ్చామని తెలిపింది. ప్రస్తుతం 6.70% వడ్డీ రేటుతో ఉన్న రుణ గ్రహీతలు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపింది.
Also Read: Jr Ntr Movie: కొరటాల శివ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్
SBI మేనేజింగ్ డైరెక్టర్ (SBI Managing Director) CS సెట్టి (CS Setty) మాట్లాడుతూ.... "పండుగ సంధర్భంగా ప్రవేశపెట్టిన జీరో ప్రాసెసింగ్ ఫీజులు మరియు రాయితీ వడ్డీ రేట్లు రుణాలు ప్రజలను ఖాతాదారులను మరింత సంతోషానికి గురి చేస్తాయని" తెలిపారు.
ఎస్బీఐ బ్యాంకు "బేస్ రేటు" (Base Rate) మరియు "ప్రైమ్ లెండింగ్" (Prime Lending) రేటును తగ్గిస్తున్నామని తెలిపారు. SBI వెబ్‌సైట్ ప్రకారం సెప్టెంబర్ 15, 2021 SBI యొక్క బేస్ రేటు 7.45% మరియు ప్రైమ్ లెండింగ్ రేటు 12.2% ఉండబోతుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook