Bank Account Fraud: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్. అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా మీ అకౌంట్ తాత్కాలికంగా లాక్ అయిందంటూ మీకు మెసేజ్‌లు వస్తున్నాయా..? అయితే అప్రమత్తంగా ఉండండి. ఆన్‌లైన్ కేటుగాళ్లు కొత్త మార్గంలో ప్రజలను దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. అన్‌లాక్ చేస్తామంటూ లింక్ పంపిస్తూ.. దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎస్‌బీఐ కస్టమర్లకు వస్తున్న ఈ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతుందగా.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెసేజ్‌లను నమ్మకండని సూచించింది. ఇలాంటి వాటికి ప్రతిస్పందించకుండా.. ఫిర్యాదు చేయాలని పేర్కొంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ అకౌంట్ తాత్కాలికంగా లాక్ చేసిందని ఎస్‌బీఐ కస్టమర్లకు మెసేజ్‌లు వస్తున్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన ట్వీట్‌లో పేర్కొంది. ఇలాంటి సందేశాలు లేదా ఈ-మెయిల్స్‌కు ఎప్పుడూ సమాధానం ఇవ్వకూడదని సూచించింది. మీ బ్యాంకింగ్ సమాచారాన్ని పంచుకోవద్దని పీఐబీ వెల్లడించింది. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే report.phishing@sbi.co.inలో ఫిర్యాదు చేయాలని కోరింది.


ఆన్‌లైన్ కేటుగాళ్లు పంపించిన లింక్‌పై క్లిక్ చేస్తే.. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బు ఖాళీ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ వ్యక్తిగత డేటాను 
దొంగిలించడంతోపాటు మీ నగదును కూడా దోచుకుంటారని చెబుతున్నారు.  గుర్తుతెలియని లింక్‌లపై ఎప్పుడు కూడా క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. కస్టమర్లు తమ ఖాతా నంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా ఎప్పుడు పంచుకోకూడదని ఎస్‌బీఐ సూచించింది. అలాంటి మెసేజ్ ఏదైనా వస్తే ముందుగా చెక్ చేసుకోవాలని పేర్కొంది. దగ్గరలోని ఎస్‌బీఐ బ్రాంచ్ లేదా కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి వైరీఫై చేసుకోవాలని కోరింది. కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంక్ అధికారులు ఎప్పుడూ అడగరని తెలిపింది. 


ఇలాంటి మెసెజ్‌లు వస్తే ఏం చేయాలి..?


==> ఈమెయిల్‌లు లేదా ఎస్‌ఎంఎస్, వాట్సాప్ సందేశాలకు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు.
==> ఏదైనా సందేశం వస్తే.. report.phishing@sbi.co.inలో ఫిర్యాదు చేయండి. 
==> మీరు 1930 నంబర్‌కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 


Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?  


Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి