State Bank of India Server Issue Today: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన చాలా మంది కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవల కోసం సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్యాంక్ సర్వర్‌ల డౌన్‌ కావడంపై ఆందోళనల వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ డౌన్‌గా ఉందని.. బ్యాంక్‌ నుంచి ఎలాంటి స్పందనలేదంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, ఎస్‌బీఐ యోనో యాప్ వంటి సేవలు ప్రభావితమయ్యాయి. అంతకుముందు ఏప్రిల్ 1న ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవలు సేవలు అందుబాటులో ఉండవని ఏప్రిల్ 1న ఎస్‌బీఐ తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవలకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.43 గంటల వరకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ ద్వారా తెలియజేసింది. అయితే సోమవారం ఉదయం నుంచి నెట్ బ్యాంకింగ్‌తో సహా పలు సేవలు నిలిచిపోయాయి. చాలామంది వినియోగదారులు ఫండ్ బదిలీలో సమస్యల గురించి కూడా ఫిర్యాదు చేశారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో యాప్‌కు సంబంధించిన సేవలు కూడా పని చేయడం లేదని ట్విట్టర్‌లో ఎస్‌బీఐకు కంప్లీట్ చేస్తున్నారు. చాలా మంది కస్టమర్‌లు తమ క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ప్రాసెస్ చేయడం లేదని నివేదించారు. 


బ్యాంక్ వెబ్‌సైట్‌లో 'బ్యాంక్ సర్వర్‌లలో ఏదో తప్పు జరిగింది. దయచేసి మళ్లీ ప్రయత్నించండి' అనే సందేశం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్ సర్వర్‌లలో సమస్యలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్.. ఎస్‌బీఐ సేవలను ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ట్వీట్ చేసింది. వినియోగదారుల ఫిర్యాదులకు ఎస్‌బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి అధికారులు సమాధానాలు ఇస్తున్నారు. 'డియర్ కస్టమర్, అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము. మీరు మళ్లీ ప్రయత్నించి.. సమస్య అలానే ఉంటే మాకు తెలియజేయండి..' అంటూ కోరుతున్నారు. 


ఎస్‌బీఐ సర్వర్ డౌన్ అయిన నేపథ్యంలో వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు.


==> బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 919223766666కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా 'BAL' అని టైప్ చేయడం ద్వారా ఎస్‌ఎంఎస్ పంపించవచ్చు.
==> గత 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్‌ను పొందడానికి ఎస్‌బీఐ కస్టమర్‌లు 919223766666 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా ఇదే నంబర్‌కు 'MSTMT' అని ఎస్‌ఎంఎస్ పంపి పొందొచ్చు. 
==> చెక్ బుక్ కోసం 917208933145 నంబరుకు 'CHQREQ' అని మెసేజ్ పంపించండి.
==> ఎస్ఎంఎస్ ద్వారా ప్రతిస్పందనగా సేవల పూర్తి జాబితాను పొందడానికి 917208933145కు 'HELP' అని టైప్ చేసి పంపించండి.
==> భాష మార్పు కోసం హిందీ లేదా ఇంగ్లీష్అ) హిందీ భాష, ఆంగ్ల భాష కోసం 917208933148కు సందేశం పంపండి.
==> మీరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ హోమ్ లోన్ వడ్డీ సర్టిఫికెట్‌ను చెక్ చేయాలనుకుంటే 917208933145కు HLI <space> <ఖాతా నంబర్> <space> <code> అని టైప్ చేసి ఎస్‌ఎంఎస్ పంపించండి.


Also Read: UPI Payment Charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల ఆదాయం.. ఐఐటీ బాంబే  సంచలన నివేదిక


Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి