Multibagger Stock: షేర్ మార్కెట్ అంతులేని ప్రపంచం. అర్ధం చేసుకుంటే అద్భుతాలే. అదృష్టం కూడా అవసరం. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే షేర్లను మల్టీబ్యాగర్ షేర్లుగా పిలుస్తారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ సాధించవచ్చు. షేర్ మార్కెట్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ కూడా తీసుకునే అవకాశముంది. మార్కెట్‌లో అలాంటి కొన్ని షేర్లు కూడా ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. అటువంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం..


పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ 15 ఏళ్ల వ్యవధిలో ఇన్వెస్టర్లకు అమితమైన లాభాల్ని తెచ్చిపెట్టింది. దాంతోపాటు షేర్ మార్కెట్ చరిత్రను కూడా సృష్టించింది. ఒకప్పుడు ఈ కంపెనీ షేర్ ధర 300 రూపాయలు. ఇప్పుుడు 50 వేలు దాటేసింది. 


2007 మార్చ్ 16వ తేదీన పేజ్ ఇండస్ట్రీస్ షేర్ ధర 271. 80 రూపాయలుంది. ఆ తరువాత క్రమంగా షేర్ ధర పెరుగుతూ పోయింది. 2014లో తొలిసారిగా పదివేలకు చేరుకుంది. 2017లో తొలిసారి 20 వేలు దాటగా, 2018లో తొలిసారిగా 30 వేలు దాటేసింది. ఆ తరువాత కొద్దికాలం పాటు తగ్గుతూ వచ్చింది.


2020లో షేర్ తిరిగి వేగం పుంజుకుంది. 2021 ఆఖరుకు షేర్ తొలిసారిగా 40 వేలు దాటేసింది. ఇప్పుడీ షేర్ ధర 50 వేలు దాటింది. పేజ్ ఇండస్ట్రీస్ షేర్ ధర 52 వారాల అత్యధికం 51,600 గా ఉంది. 52 వారాల అత్యల్పం 31,565 రూపాయలుంది. 2022 సెప్టెంబర్ 21న ఈ కంపెనీ షేర్ ధర 50,850 రూపాయలుంది. 


15 ఏళ్ల క్రితం 300 రూపాయల చొప్పున 1000 షేర్లు కొనుగోలు చేసుంటే..3 లక్షల పెట్టుబడి అయుండేది. ఇప్పుడీ షేర్ 50 వేలు దాటడంతో..వేయి షేర్ల ధర 5 కోట్ల రూపాయలకు చేరుకుంది. 15 ఏళ్లలో కోటీశ్వరులయ్యారు. 


Also read: Post office Schemes: బ్యాంకుల కంటే అధిక లాభాల్ని అందించే పోస్టాఫీసు పథకాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok