Share Market: షేర్ మార్కెట్ అంతులేని లాభాల్ని ఆర్జిస్తుందని తెలిసినా చాలామంది పెట్టుబడి పెట్టేందుకు భయపడుతుంటారు. కారణం ఎప్పుడు ఏమౌతుందో తెలియని పరిస్థితి ఉంటుందని. అందుకే షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే అనుభవజ్ఞులైన స్టాక్ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తుండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉండి ఏ కంపెనీ షేర్ కొనుగోలు చేయాలో తెలియకపోతే తొందరపడకూడదు. నిపుణులు లేదా బ్రోకరేజ్ సంస్థలు చేసే సిఫార్సులను పరిగణలో తీసుకోవాలి. దేశంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సహా ఇతర సంస్థలు మూడు కంపెనీల స్టాక్స్‌ని సిఫారసు చేస్తున్నాయి. ఈ మూడింటిలో పెట్టుబడి పెడితే అద్భుతమైన లాభాలు ఆర్జించవచ్చు. ఆ స్టాక్స్ వివరాలు తెలుసుకుందాం..


నిపుణులు, బ్రోకరేజ్ సంస్థలు చేస్తున్న సూచనల ప్రకారం హవెల్స్ కంపెనీ షేరు ప్రస్తుతం గ్రోయింగ్‌లో ఉంది. ఈ షేర్ 1400 వరకూ చేరవచ్చని అంచనా. ఇప్పుడైతే ఈ షేరుని 1280-1290 మధ్య కొనుగోలు చేయవచ్చు. స్టాప్ లాస్ 1200 గా పెట్టుకుంటే 9 శాతం వృద్ధి ఉంటుంది. 


మరో ప్రముఖ కంపెనీ సెంచరీ టెక్స్‌టైల్స్. ఈ షేర్ కూడా పెరుగుతోంది. రానున్న స్వల్పకాలంలో 12 శాతం ఆదాయం అందించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ స్టాక్‌ను 717-723 మధ్యలో కొనవచ్చు. 800 వరకూ చేరే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్ స్టాప్ లాస్ 670 అనుకుంటే బాగుంటుంది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ప్రస్తుతం బాగుంది. 7620-7600 మద్యలో కొనుగోలు చేస్తే 4 శాతం పెరగవచ్చు. టార్గెట్ ప్రైస్ 7900 ఉంది.


స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌లో చాలా అప్రమత్తత అవసరం. ఈక్విటీ మార్కెట్‌‌లో చాలా సందర్భాల్లో పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకుండా పెద్దఎత్తున నష్టాలు ఎదుర్కోవచ్చు. అందుకే షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలి. ఒక్కోసారి నిపుణులు చెప్పినా నష్టాలు రావచ్చు. స్టాక్ మార్కెట్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వింత ప్రపంచం.


Also read: Whatsapp New Feature: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్, గ్రూప్స్‌పై నియంత్రణకు ఇక అడ్మిన్ రివ్యూ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook