Simple Energy One Price, Range and Reviews: జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 'సింపుల్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌' విడుదలైంది. సింపుల్ ఎనర్జీ కంపెనీ ఎట్టకేలకు నేడు రిలీజ్ చేసింది. ఈ స్కూటర్‌ను సింపుల్‌ ఎనర్జీ కంపెనీ 2021 ఆగస్టులోనే ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఏదో ఒక అప్‌డేట్‌తో జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని, సురక్షితమైన డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వడం కోసం సుదీర్ఘంగా టెస్ట్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించింది. ఇక సింపుల్ ఎనర్జీ కంపెనీ ఇప్పటికే 18 నెలల్లో 1 లక్షకు పైగా ప్రీ-బుకింగ్‌లను పొందింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Simple One Battery:
సింపుల్‌ వన్‌ ఎలెక్ట్రిక్ స్కూటర్‌పై  ‘రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ కోసం చాలా సమయం, డబ్బు వెచ్చించినట్లు సింపుల్‌ ఎనర్జీ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. సుదీర్ఘ దూరం, అత్యంత స్మార్ట్‌, ఫాస్ట్‌ టెక్నాలజీ మరియు డ్యుయల్‌ బ్యాటరీ ఈ స్కూటర్‌ ప్రత్యేకలు అని చెప్పారు. IP67 రేటింగ్‌తో కూడిన 5kWh లిథియం ఐయాన్‌ డ్యుయల్‌ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సింపుల్‌ వన్‌ ఎలెక్ట్రిక్ స్కూటర్‌లు 95 శాతం పరికరాలు దేశీయమైనవే అని రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. 


Simple One Price:
సింపుల్‌ వన్‌ స్కూటర్‌ ధర రూ.1.45 లక్షల (ఎక్స్‌షోరూం బెంగళూరు) నుంచి ప్రారంభమవుతుంది. 750 వాట్‌ పోర్టబుల్‌ ఛార్జర్‌కు అదనంగా రూ.13,000 (రూ. 1.58 లక్షలు) ఉంటుంది. ముందుగా బెంగళూరులో జూన్‌ 6 నుంచి సింపుల్‌ వన్‌ స్కూటర్‌ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తర్వాత మిగతా నగరాల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాజెన్ బ్లాక్, నమ్మ రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, బ్రజెన్ ఎక్స్ మరియు లైట్ ఎక్స్ వంటి ఆరు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.


Simple One Range:
సింపుల్‌ వన్‌ స్కూటర్‌ ఒక్క నిమిషంలోనే 1.5 కి.మీ ప్రయాణించేందుకు కావాల్సిన ఛార్జింగ్‌ పూర్తవుతుంది. 5 గంటల 54 నిమిషాల్లో 0- 80 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే.. 212 కిమీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2.77 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుందట. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌IP-67 రేటింగ్ కలిగిన 5 kWh లిథియం-అయాన్ పోర్టబుల్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. భారతదేశంలోని ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌కైనా ఇది అత్యధిక శ్రేణి అని సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. 


Simple One Features:
సింపుల్‌ వన్‌ స్కూటర్‌లో 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 72 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది కేవలం 2.77 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో 7 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లే, నావిగేషన్‌, డాక్యుమెంట్‌ స్టోరేజ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, బ్యాటరీ రేంజ్‌ వివరాలు, కాల్‌ అలర్ట్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 


Also Read: GT vs CSK Qualifier 1: చెన్నైతో గుజరాత్‌ మ్యాచ్‌.. ధోనీ సేనకు గిల్‌ వార్నింగ్‌!


Also Read: GT vs CSK Qualifier 1: అన్ని గుజరాత్ టైటాన్స్‌కే అనుకూలం.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓటమి తప్పదా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.