GT vs CSK Qualifier 1: చెన్నైతో గుజరాత్‌ మ్యాచ్‌.. ధోనీ సేనకు గిల్‌ వార్నింగ్‌!

Opener Shubman Gill React on Gujarat Titans Bowling. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 23, 2023, 01:21 PM IST
GT vs CSK Qualifier 1: చెన్నైతో గుజరాత్‌ మ్యాచ్‌.. ధోనీ సేనకు గిల్‌ వార్నింగ్‌!

Shubman Gill React on Gujarat Titans Bowling: ఐపీఎల్‌ 2023లో నేడు రసవత్తర పోరు జరగనుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్స్ అయిన గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తొలి క్వాలిఫయర్‌ జరుగనుంది. చెన్నైలోని చెపాక్‌ మైదానం వేదికగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ (CSK vs GT IPL 2023 Qualifier 1) ఆరంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి తొలి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకునేందుకు డిఫెండింగ్‌  చాంపియన్‌ గుజరాత్‌, నాలుగుసార్లు ట్రోఫీ విజేత చెన్నై సిద్ధంగా ఉన్నాయి. సమ ఉజ్జీల మధ్య పోటీ కావడంతో ఇరు జట్లు అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ని ఎదుర్కొనేందుకు తమ వద్ద గొప్ప బౌలింగ్‌ దళం ఉందని.. ధోనీ సేనకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ సందర్భంగా శుభ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ... 'చెపాక్‌ వికెట్‌పై చెన్నై జట్టుని ఎదుర్కొనేందుకు మా వద్ద గొప్ప బౌలింగ్‌ దళం ఉంది. చెన్నైలో చెన్నైతో తలపడటం కోసం మేం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. రెండోసారి మేం ఫైనల్‌లో అడుగుపెడతామనే నమ్మకం నాకు ఉంది' అని ధీమా వ్యక్తం చేశాడు. 

'నా ఆట నాకు తెలుసు. ఏ ఆటగాడికైనా తనకు తాను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. పరుగులు చేస్తున్నందుకు చాలా సంతోషం. మంచి ఆరంభం లభించాలి. అప్పుడే పెద్ద స్కోర్లు చేయగలం. గత మ్యాచ్‌లో నేను అలా చేయగలిగాను’ అని శుభ్‌మన్‌ గిల్‌ తన సెంచరీపై స్పందించాడు. 16వ సీజన్‌లో గిల్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 14 మ్యాచులు ఆడి 680 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో బెంగళూరు కెప్టెన్‌ ఫఫ్ డుప్లెసిస్‌ (730) తర్వాతి స్థానంలో ఉన్నాడు. గుజరాత్ జట్టుకు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉండటంతో.. డుప్లెసిస్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

గుజరాత్‌ టైటాన్స్ బౌలర్లు మహ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ పోటీపడి వికెట్స్ తీస్తున్నారు. షమీ 24 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సంపాదించగా.. రషీద్‌ 24 వికెట్లు తో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమ బౌలింగ్‌ గొప్పగా ఉందని శుభ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్‌, చెన్నై మూడుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. మూడింటిలోనూ గుజరాత్ విజయం వరించింది. ఇక చెపాక్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. మరి ఈసారి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 

Also Read: Virat Kohli: థ్యాంక్యూ బెంగుళూరు.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్  

Also Read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

Trending News