Smartphone Tips: నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని జరగదనే విధంగా పరిస్థితులు మారాయి. సినిమాల నుంచి షాపింగ్ వరకు అన్ని స్మార్ట్ ఫోన్ లోనే అయిపోతున్నాయి. అయితే ఇంతటి వాడకం కారణంగా కొన్నిసార్లు మొబైల్ పనితీరు నెమ్మదించవచ్చు. అయితే మొబైల్ పనితీరు మందగించినా.. కొందరు స్మార్ట్ ఫోన్స్ ను అలానే యూజ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల వాటి జీవితకాలాన్ని తగ్గించినట్లు అయ్యింది. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ టిప్స్ ను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ తప్పులు చేయకండి!


1. ప్లే స్టోర్ కాకుండా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి యాప్స్ ను ఇన్‌స్టాల్ చేయవద్దు!


మీరు Android మొబైల్ ను వినియోగిస్తున్నట్లయితే.. మీకు Play Store గురించి తప్పుకుండా తెలుసుకోవాలి. ఏమైనా యాప్స్ కావాలంటో దాని నుంచే కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. Google తన ప్లాట్‌ఫారమ్‌లో సురక్షితమైన, చట్టబద్ధమైన యాప్‌లను మాత్రమే ప్లే స్టోర్ లో పొందుపరుస్తుంది. 


కానీ, కొన్ని వెబ్ సైట్స్ లో APK ఫైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఆ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. వీటిని నివారించాలి. లేదంటే మీ స్మార్ట్ ఫోన్ ను హాని కలిగించే వారు అవుతారు. మాల్వేర్ వంటి వైరస్ లను ఈ APK యాప్స్ ద్వారా చొప్పించి.. ఆర్థిక నష్టాన్ని కలిగిస్తారు. 


2. బయట Wi-Fiని ఉపయోగించడం వల్ల..


డబ్బు, డేటాను ఆదా చేసే భారంతో చాలా మంది ఉచిత Wi-Fi కోసం వెతుకుతారు. ఉచిత WiFi అందుబాటులోకి వచ్చిన తర్వాత, వారు తమ పరికరాన్ని దానికి కనెక్ట్ చేస్తారు. కానీ ఇది సురక్షితమైన పద్ధతి కాదు. ఇది మీ ఫోన్‌కు హాని కలిగించవచ్చు.


3. మరో కంపెనీ ఛార్జర్ ను ఉపయోగించరాదు!


మార్కెట్లో అందుబాటులో ఉండే ప్రతి స్మార్ట్ ఫోన్ కు దానికి సంబంధించిన ఛార్జర్స్ లభిస్తాయి. కానీ, ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ, చాలా వాళ్లు వాడే స్మార్ట్ ఫోన్స్ కు వేర్వేరు ఛార్జర్స్ వాడడం వల్ల దాని జీవితకాలం తగ్గిపోతుంది. 


4. అప్లికేషన్‌ను అప్‌డేట్ చేయడంలో లోపం వల్ల..


యాప్‌ను అప్‌డేట్ చేయడం వల్ల ఫోన్ మెమరీ తగ్గిపోతుందని చాలా మంది వినియోగదారులు భావిస్తున్నారు. కాబట్టి వారు ఏదైనా యాప్ పాత వెర్షన్‌లను మాత్రమే కలిగి ఉంటారు. వారు యాప్ అప్‌డేట్‌లను చేయకుండా అలానే వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్స్ జీవితకాలం తగ్గిపోయే అవకాశం ఉంది. 


5. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ కాకపోవడం..


మొబైల్ కంపెనీలు తమ ఫోన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించి కంపెనీలు మొబైల్‌కు నోటిఫికేషన్ పంపుతున్నాయి. కానీ చాలా మంది వినియోగదారులు దీన్ని పట్టించుకోరు. స్మార్ట్ ఫోన్ లో తాజా వర్షెన్ అందుబాటులో ఉండడం వల్ల ఫోన్ లో సమస్యలు తలెత్తే అవకాశం తక్కువగా ఉంది. 


Also Read: Free Ola Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై 202 కి.మీ. ప్రయాణించిన వ్యక్తికి మరో స్కూటర్ గిఫ్ట్!


Also Read: Saudi Arabia: భారత్‌ సహా 16 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన సౌదీ అరేబియా ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook