SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?
Sovereign Gold Bonds: బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరింగ్ గోల్డ్ బాండ్లు లక్ష్యాన్ని సాధించాయా... ఒకవేళ లక్ష్యం నెరవేరని నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తుందా లేక ఉపసంహరించుకుంటుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం వ్యాపార వాణిజ్య వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Buying SGBs from the stock market: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం విదేశీ మారకాన్ని కాపాడేందుకు బంగారం దిగుమతులను తగ్గించేందుకు 2015 వ సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్ళను తగ్గించి క్రమంగా నిధులను గోల్డ్ బాండ్లపై మళ్లించినట్లయితే, ప్రభుత్వానికి ఆదాయంతో పాటు బంగారం కొనుగోళ్లను కూడా నిరుత్సాహపరచవచ్చని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగానే గడచిన 8 సంవత్సరాలుగా ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తూ వస్తున్నారు.
అయితే ఆశించిన లక్ష్యాలను అందుకోలేదని పసిడి దిగుమతులు అనుకున్న స్థాయిలో తగ్గలేదని ప్రతి సంవత్సరం భారతదేశంలో దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి నుంచి జూన్ వరకు భారతదేశ 376 టన్నుల బంగారాన్ని దిగుమతి చేస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఇది గత సంవత్సరం తో పోల్చితే 16% ఎక్కువగా తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోల్డ్ బాండ్లను ప్రవేశపెట్టిన ప్రయోజనం లేకుండా పోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ఆశించిన ఫలితాలు లభించని నేపథ్యంలో ఆర్బీఐ అత్యంత లాభదాయకమైన గోల్డ్ SGB పథకాన్ని కొనసాగిస్తుందా..లేదా నిలిపివేస్తుందా అనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తున్న పథకాన్ని కేంద్రం కొనసాగిస్తుందా లేదా అనే విషయంపై తీవ్ర భయాందోళనలు ఉన్న తరుణంలో, విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం.
Also Read : EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్
గోల్డ్ SGBలు మొదట నవంబర్ 2015లో రూ. 2,684 ఇష్యూ ధరతో విడుదల చేయగా, అవి ఇప్పుడు 9 సంవత్సరాల క్రింద, రూ. 7,200 వద్దకు ట్రేడవుతోంది. ఈ గోల్డ్ బాండ్లు ఆ రోజు బంగారం ధర ఆధారంగా బాండు ధరను నిర్ణయిస్తారు. బహిరంగా మార్కెట్లో బంగారం పెరుగదతో సమానంగా ఈ బాండ్ల విలువ మారుతుంది. ఈ బాండ్లు బంగారంతో సమానం. అయితే ఇవి డిజిటల్ రూపంలో ఉంటాయి. ఈ బాండ్లను నగదుగా మార్చుకోవచ్చు. కానీ బంగారం పొందలేము.
2016 నుండి 2024 వరకు ధరలు రెండింతలు పెరిగాయని ఆనంద్ రాఠీ షేర్‌లోని డైరెక్టర్-కమోడిటీస్ అండ్ కరెన్సీ నవీన్ మాథుర్ తెలిపారు, ఆగస్టు 2024లో మెచ్యూర్ అయ్యే SGBలపై ఇన్వెస్టర్లు మంచి రాబడి పొందారు. ఇదిలా ఉంటే 2023-24లో బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 795 టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వ వాణిజ్య డేటా విశ్లేషణ చూపిస్తుంది.
2023-2024లో 44.3 టన్నులతో విలువైన SGB బాండ్లుగా నమోదు అయ్యాయి. అయితే ఈ పథకం ఉద్దేశ్యం బంగారం దిగుమతులను నిరోధించడం కానీ ఆ లక్ష్యం నెరవేరలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ఒక్క సావరిన్ గోల్డ్ బాండును కూడా ఇంకా జారీ చేయలేదు. కొత్త బాండ్లను సెప్టెంబర్ నెలలో జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Senior Citizen Saving Scheme: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.