SBI Mclr Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కోట్లాది మంది కస్టమర్లకు షాకిచ్చింది. మరోసారి లోన్‌పై వడ్డీ రేట్లను పెంచేసింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ల (MCLR)ను ఒక ఏడాది పాటు పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు తర్వాత హౌసింగ్ లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ వంటి అన్ని రకాల రుణాలపై అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం లోన్‌ తీసుకున్న వారిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 బేసిస్ పాయింట్ల పెంపు


ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. బ్యాంక్ ఒక సంవత్సరం కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. గతంలో బ్యాంకు ఒక సంవత్సరం రుణంపై 8.30 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయగా.. ఇప్పుడు అది 8.40 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన అన్ని రకాల లోన్‌లపై ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపు నేటి (జనవరి 15) నుంచే అమలు కానుంది. 


  • ఓవర్ నైట్ ఎంసీఎల్‌ఆర్‌ - 7.85 శాతం

  • 1 నెల ఎంసీఎల్‌ఆర్‌- 8.00 శాతం

  • 3 నెలలకు ఎంసీఎల్‌ఆర్‌- 8.00 శాతం

  • 6 నెలలఎంసీఎల్‌ఆర్‌- 8.30 శాతం

  • 1 సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌- 8.40 శాతం

  • 2 సంవత్సరాలకు ఎంసీఎల్‌ఆర్‌- 8.50 శాతం

  • 3 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌- 8.60 శాతం


మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ వ్యవస్థను 2016లో ప్రారంభించింది రిజర్వ్ బ్యాంక్. బ్యాంకులు తమ కస్టమర్లకు లోన్ వడ్డీ రేటును అందించే కనీస వడ్డీ రేటు ఇది. ఇది బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా పెంచుతూ.. తగ్గిస్తూ ఉంటాయి. దీని ఆధారంగా వివిధ లోన్‌ ఈఎంఐలు నిర్ణయిస్తారు.


స్టేట్ బ్యాంక్‌తో పాటు, పబ్లిక్ సెక్టార్ ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 35 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ ఓవర్‌నైట్ లోన్‌పై 7.85 శాతం, 1 నెలలో 8.15 శాతం, 3 నెలల్లో 8.25 శాతం, 6 నెలల్లో 8.35 శాతం, 1 సంవత్సరంలో 8.50 శాతం ఎంసీఎల్ఆర్ ఆఫర్ అందుబాటులో ఉంది.


ఐడీబీఐ బ్యాంక్ తన ఎల్‌సీఎల్‌ఆర్‌ను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు జనవరి 12 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ 7.65 శాతం ఓవర్‌నైట్ లోన్, 1 నెలలో 7.80 శాతం, 3 నెలల్లో 8.10 శాతం, 6 నెలల్లో 8.30 శాతం, 1 సంవత్సరం MCLRపై 8.40 శాతం ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ 2 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9 శాతం, 3 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.40 శాతంగా ఉంది.


Also Read: Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ..  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి