5 Stocks For High Returns: మీ వద్ద ఉన్న డబ్బులను ఎక్కడ పొదుపు చేయాలా అని ఆలోచిస్తున్నారా ? బ్యాంకులో డిపాజిట్ చేసినా.. లేదా పోస్ట్ ఆఫీసులో పొదుపు చేసినా.. పెద్దగా వడ్డీ రాదు కదా అని ఆలోచిస్తున్నారా ? అయితే , ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ సిఫార్సు చేస్తోన్న ఈ ఐదు రకాల స్టాక్స్ పై ఓ లుక్కేయండి. షేర్ ఖాన్ చెబుతున్న అంచనాల ప్రకారం కనీసం 16 శాతం నుండి 48 శాతం వరకు లాభాలు ఇచ్చే ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ సిఫార్సు చేసిన ఐదు స్టాక్స్‌లో మొదటిది TCI Express Stock. 12 అక్టోబర్ నాడు స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ముగిసే సమయానికి టీసీఐ ఎక్స్ ప్రెస్ కంపెనీ స్టాక్ రూ. 1387 వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఈ స్టాక్ ధర ఏడాదిలో 2077 కి చేరుకుంటుంది అని షేర్ ఖాన్ అంచనా వేసింది. అంటే కనీసం 48 శాతం లాభాలు వస్తాయన్న మాట.


షేర్ ఖాన్ సిఫార్సు చేసిన మరో స్టాక్ Exide Stock. రాబోయే ఏడాది కాలంలో ఎక్సైడ్ స్టాక్ 16 శాతం మేరకు పెరిగి రూ. 301 కి చేరుకునే అవకాశం ఉంది అని షేర్ ఖాన్ అంచనా వేసింది. అక్టోబర్ 12న ఎక్సైడ్ స్టాక్ ధర రూ. 264.80 గా ఉంది.


ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ షేర్ ఖాన్ సిఫార్సు చేసిన స్టాక్స్ లో మూడోది. అక్టోబర్ 12 నాడు రూ. 954 గా ఉన్న ICICI Bank Stock ధర వచ్చే ఏడాది కాలంలో 18 శాతం మేర పెరిగి రూ. 1120 కి చేరుకుంటుంది అని షేర్ ఖాన్ అంచనా వేసింది.


షేర్ ఖాన్ సజెస్ట్ చేసిన స్టాక్స్ లో నాలుగోది NMDC Stock. రాబోయే ఏడాది కాలంలో ఎన్ఎండీసీ స్టాక్ 16 శాతం మేర పెరుగుతుంది అని షేర్ ఖాన్ అంచనా వేస్తోంది. అక్టోబర్ 10న షేర్ ఖాన్ అంచనా వేసే సమయానికి రూ. ఎన్ఎండీసీ స్టాక్ రూ. 151 వద్ద ట్రేడ్ అవుతోంది.


KEC Shares విషయంలోనూ షేర్ ఖాన్ బై రేటింగ్ ఇచ్చింది. అక్టోబర్ 10 నాటికి రూ. 665 వద్ద ట్రేడ్ అవుతున్న కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్స్  మరో ఏడాది కాలంలో రూ. 770 మార్క్ ని తాకుతుంది అని షేర్ ఖాన్ బై రేటింగ్స్ లో పేర్కొంది. 


ఇది కూడా చదవండి : Nissan Magnite SUV: దేశంలోనే అత్యంత చవకైన ఎస్‌యూవీ ఇదే , బుకింగ్స్ ప్రారంభం


గమనిక: ఇక్కడ పేర్కొన్న స్టాక్స్ అన్నీ ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ షేర్ ఖాన్ అంచనాల మేరకే వెల్లడించడం జరిగింది కానీ ఇందులో జీ తెలుగు న్యూస్ సొంత అభిప్రాయాలు లేవు అని గమనించగలరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆయా స్టాక్స్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత కానీ లేదా మీ బిజినెస్ అడ్వైజర్‌తో చర్చించిన తరువాత కానీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోగలరు.


ఇది కూడా చదవండి : Asia Richest Person 2023: హారున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 విడుదల, ఆసియా కుబేరుడు అంబానీనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి