Stocks today: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఒడుదొడుకులు ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీనితో వరుసగా ఐదు రోజుల లాభాలకు చెక్ పడింది. నేటి సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ 709 పాయంట్ల నష్టంతో 55,776 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 208 పాయింట్లు తగ్గి 16,663 వద్దకు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారణాలివే..


అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చింతి దేశీయ స్టాక్ మార్కెట్లపై కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్​ మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీనితో దేశీయ సూచీలు కూడా భారీగా పతనాన్ని నమోదు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


సూచీల కదలికలు ఇలా..


ఇంట్రాడేలో సెన్సెక్స్ 56,720 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 55,418 కనిష్ఠానికీ పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 16,927 పాయింట్ల స్థాయిని తాకింది. అత్యల్పంగా 16,555 స్థాయిని కూడా చేరింది.


నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..


ఎం అండ్ ఎం (2.31 శాతం), మారుతీ సుజుకీ (1.40 శాతం), నెస్లే ఇండియా (0.82 శాతం), ఏషియన్​ పెయింట్స్ (0.81 శాతం), టైటాన్​ (1.47 శాతం) లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.


టాటా స్టీల్​ (4.89 శాతం), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.11 శాతం), టెక్ మహీంద్రా బ్యాంక్ (2.92 శాతం), ఇన్ఫోసిస్​ (2.73 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్​ (2.28 శాతం) నష్టపోయాయి.


Also read: PAN Aadhaar Link: ఆధార్​తో పాన్​ లింక్ చేయకుంటే ఏం జరుగుతుంది?


Also read: Gold and Silver Rates Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర! నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook