Stock Market today: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర- 61 వేల మార్క్‌పైకి సెన్సెక్స్
Stock Market today: స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజూ బుల్ జోరు కొనసాగింది. బుధవారం సెషన్లో (stocks closing bell) ఆటో, బ్యాంకింగ్ రంగాలు సానుకూలంగా స్పందించాయి.
Stock Market today: స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. నేటి సెషన్లో సూచీలు భారీ లాభాలను (stocks closing bell) నమోదు చేశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 507 పాయింట్లు బలపడి 61,124 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 157 పాయింట్ల లాభంతో 18,212 వద్ద స్థిరపడింది. సూచీలు లాభాలను నమోదు చేయడం వరుసగా ఇది నాలుగో సెషన్.
ఆటో, బ్యాంకింగ్ షేర్లు అధికంగా లాభాలను నమోదు చేశాయి. ఐటీ షేర్లు కాస్త డీలా పడ్డాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు, లాక్డౌన్ భయాలు వెంటాడుతున్నా స్టాక్ మార్కెట్లు ముందుకే సాగుతుండటం విశేషం.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 61,218 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 60,850 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,228 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,128 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 6 కంపెనీలు డీలా పడ్డాయి.
ఎం&ఎం 4.59 శాతం, భారతీ ఎయిర్టెల్ 3.75 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.67 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.61 శాతం లాభాలను నమోదు చేశాయి.
టైటాన్ 1.56 శాతం, టీసీఎస్ 1.47 శాతం, టెక్ మహీంద్రా 0.78 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.62 శాతం, విప్రో 0.30 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్, హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను భారీగా లాభాలను నమోదు చేశాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ (Rupee value today) రూ.73.96 వద్ద కొనసాగుతోంది.
Also read: Petrol Diesel Update: వాహనదారులకు గుడ్ న్యూస్- 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా పొందండి!
Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook