Deep Diamond India Limited Share Stock Split: డీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ షేర్లు ఈ వారం ఎక్స్-స్ప్లిట్‌లో ట్రేడ్ అవుతాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇటీవలే కంపెనీ స్టాక్‌ స్ప్లిట్‌ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికీ  జనవరి 20ని రికార్డు తేదీగా కూడా కంపెనీ నిర్ణియించింది. అయితే డీప్ డైమండ్ ఈ రోజూ 5% క్షీణించి రూ.145.40 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం నష్టపోయి రూ.152.55 వద్ద ముగిసింది. అయితే భవిష్యత్‌లో ఈ షేర్‌ ఎక్స్-స్ప్లిట్‌ అవ్వడం వల్ల కొనుగోలుదారులకు ఏవైన ప్రయోజనాలు కలుగుతాయా లేదా నష్టపోయే అవకాశాలున్నాయా.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాదిలో ఈ షేర్‌ వల్ల 842% రాబడి:
డీప్ డైమండ్ ఇండియా గత ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. ఒక సంవత్సరంలో స్టాక్ 842% పైగా లాభపడింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ దాదాపు 339% లాభపడిన సంగతి తేలిసిందే..గత ఐదేళ్లలో స్టాక్ దాదాపు 1,000% పెరిగింది. ఈ స్టాక్ డైమండ్ ఇండియా త్రైమాసిక ఫలితాలను కూడా ప్రకటించింది. కంపెనీ రూ.61 లక్షలకుపైగా నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు కాగా..సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.32 లక్షల నికర లాభాన్ని ఆర్జించిందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టాయి.


స్టాక్ స్ప్లిట్ అంటే ఏమిటి?:
మార్కెట్‌లో స్టాక్ లిక్విడిటీని పెంచడానికి కంపెనీలు స్టాక్ స్ప్లిట్‌లను ప్రకటిస్తాయి. దీని కింద రికార్డు తేదీ వరకు స్టాక్‌ను కలిగి ఉన్నపెట్టుబడిదారులు డీమ్యాట్ ఖాతాలలో కొత్త షేర్లను స్వీకరిస్తారు. అంతేకాకుండా షేర్ల ధరల్లో కూడా మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.


ఇది కూడా చదవండి : Uppal Stadium Cricket Match: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. ఎప్పటి నుంచి లోపలికి అనుమతిస్తారంటే..


ఇది కూడా చదవండి : Uppal Stadium Cricket Match: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. ఎప్పటి నుంచి లోపలికి అనుమతిస్తారంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook