New GST Norms: కస్టరమర్ల నుంచే 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న స్విగ్గీ, జొమాటోలు!
New GST Norms: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నిబంధనల్లో సవరణలు చేసింది. దీనితో స్విగ్గీ, జొమాటోలు కస్టమర్ల నుంచే నేరుగా జీఎస్టీ వసూలు చేస్తున్నాయి.
New GST Norms: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో వంటివి శనివారం (జనవరి 1) నుంచి నేరుగా వినియోగదారుల నుంచి 5 శాతం జీఎస్టీ (5 pc GST on Swiggy, Zomato Orders) వసూలు చేయడం ప్రారంభించాయి. కేంద్రం ప్రభుత్వం సవరించిన రూల్స్ (New GST rules) మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
నిబంధనల్లో మార్పు ఎందుకు?
ఇంతకు ముందు ఎవరైనా వినియోగదారులు స్వీగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ వేదికల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఆ అర్డర్ విలువలతో పాటు, డెలివరీ ఛార్జీలు (కొన్ని సార్లు మినాహాయింపు ఉంటుంది.) మాత్రమే వసూలు చేసేవి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న రెస్టారెంట్లు వినియోగదారుడి నుంచి పన్ను వసూలు చేసేవి.
కొన్ని గుర్తింపు లేని హెటళ్లు, రెస్టారెంట్లు కూడా స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయాలు సాగిస్తూ.. పన్ను చెల్లించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగానే నిబంధనలను సవరించింది. ఈ నిర్ణయంతో జీఎస్టీ పరిధిలోకి వచ్చే హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
అయితే ఈ నిర్ణయం వల్ల వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదనే చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఇంతకు ముందు వినియోగదారుల నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు జీఎస్టీ వసూలు చేసేవి.. మారిన నిబంధనలతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జీఎస్టీని వసూలు చేస్తాయి. అయితే వినియోగదారులపై భారం పడకుండా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు గతంలో కేంద్రం వెల్లడించింది. అంటే రెస్టారెంట్లపైనే భారం పడేలా ఈ ప్రక్రియ సాగొచ్చని తెలుస్తోంది.
సెప్టెంబర్‌లోనే నిర్ణయం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 17న జరిగిన జీఎస్టీ మండలి భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. జీఎస్టీ ఎగవేతలను నివారించేందుకు.. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ నుంచే నేరుగా జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also read: Faast E-Scooter: ఒకాయా నుంచి 'ఫాస్ట్'- ఒక్కసారి ఛార్జ్‌తో 200 కిలో మీటర్ల ప్రయాణం!
Also read: Spicejet Offer: కేవలం 1122 రూపాయలకే దేశీయంగా విమాన ప్రయాణం, స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook