Faast E-Scooter: దేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త విద్యుత్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీలతో కూడిన మరిన్ని ఈవీలను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
గురుగ్రామ్ కేంద్రంగా పని చేస్తున్న 'ఒకాయా' తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను (New Electric Scooter) మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చింది. 'ఫాస్ట్' పేరుతో వచ్చిన ఈ కొత్త స్కూటర్ (Okaya new E-Scooter) విశేషాలు ఇలా ఉన్నాయి.
ఫాస్ట్ ఈ-స్కూటర్ ధర ఎంతంటే..
ఫాస్ట్ ఈ-స్కూటర్ ధరను (ఎక్స్ షోరూం) రూ.89,999గా (Faast E-Scooter price) ఉంచింది కంపెనీ. ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ వల్ల వివిధ రాష్ట్రాల్లో ఈ ధరలో మార్పు ఉండనుంది.
ఇప్పటికే ఈ స్కూటర్లకు ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది ఒకాయా. కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి వీటిని బుక్ చేసుకోవచ్చు. ముందస్తు బుకింగ్ కోసం రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నుంచి డెలివరీలు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఫాస్ట్ స్కూటర్.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్, ఆథెర్ 450ఎక్స్, బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1, బజాజ్ చేతక్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఫాస్ట్ ఫీచర్లు(Faast E-Scooter Features)..
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 150-200 దూరం ప్రయాణించే సామర్థ్యం
- గంటలకు 60-70 వేగంతో ప్రయాణించే అవకాశం
- 2x72V 30 AH బ్యాటరీ
- 1200 వాట్స్ మోటార్, 2500 వాట్స్ పీక్ పవర్
- 3-4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే సామర్థ్యం
- ఐఓటీ- యాప్ ఆధారిత కనెక్టివిటీ
- పోర్టబుల్ బ్యాటరీ
- అన్ని ఎల్ఈడీ లైట్లు
త్వరలో ఫెర్రాటో..
గత నెల 24-26 మధ్య గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈవీ ఎక్స్‌పోలో వివిధ కంపెనీలు తాము తీసుకురానున్న కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీని ప్రదర్శించాయి.
వీటిలో ఒకాయా కూడా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచింది. 'ఫెర్రాటో' పేరుతో ఈ స్కూటర్‌ను ఈ ఏడాది మధ్యలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Also read: Spicejet Offer: కేవలం 1122 రూపాయలకే దేశీయంగా విమాన ప్రయాణం, స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ఇదే
Also read: AMAZON Cricket Streaming: హాట్‌స్టార్‌కు పోటీపగా అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook