SIP Investment: ప్రస్తుతం ఎవరికైనా సరే నెలకు 2 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం అంటే పెద్ద కష్టమేం కాదు. నెలకు 20 వేలు సంపాదించే వ్యక్తి చాలా సులభంగా నెలకు 1000 రూపాయలు ఎక్కువ రిటర్న్స్ ఉండేచోట ఇన్వెస్ట్ చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెలకు వేయి లేదా 2 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదనేది చాలా మంది ఆలోచనగా ఉంటుంది. అయితే సరైంది కాదు. చిన్న చిన్న మొత్తాలతో కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎక్కువ డబ్బులు జమ చేయవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఏ మాత్రం రిస్క్ లేనిది. కానీ దీని ద్వారా పెద్ద పెద్ద ఆర్ధిక లక్ష్యాన్ని చేరుకోలేరు. అదే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో కొద్దిగా రిస్క్ ఉన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అందుకే కేవలం 1000 లేదా 2 వేల రూపాయలతో ఎస్ఐపీ ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టవచ్చు.


నెలకు 5000 రూపాయలు పెట్టుబడి పెట్టే స్థితిలో ఉంటే నెలకు 2 వేల రూపాయలతో ఎస్ఐపీ ప్రారంభించండి. ఎందుకంటే నెలకు 2 వేలంటే పెద్ద కష్టమైన పనేం కాదు. నెలకు 20 వేలు సంపాదించినా వేయి రూపాయలు ఎలాగోలా ఇన్వె,స్ట్ చేయవచ్చు. నెలకు 1000 రూపాయలు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో పెట్టుబడి పెడితే 20 ఏళ్లకు కనీసం 30 లక్షలు కూడా అందుకోలేరు. 20 ఏళ్లలో కేవలం 2.40 లక్షలే జమ చేయగలరు. అదే నెలకు వేయి రూపాయల్ని మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లకు అద్భుతమైన ఊహించని రిటర్న్స్ సాధించవచ్చు.


నెలకు 1000 రూపాయలు ఎస్ఐపీలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే దానిపై 12 శాతం రిటర్న్స్ రావచ్చు. అంటే 20 ఏళ్లకు 10 లక్షలు సంపాదించగలరు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం 2.40 లక్షలే. అదే 15 శాతం రిటర్న్స్ అందితే 20 ఏళ్లకు 15 లక్షలు సంపాదించవచ్చు. ఇక 20 శాతం రిటర్న్స్ లెక్కేస్తే 20 ఏళ్లకు 31 లక్షలు సంపాదించగలరు. 


అదే వేయి రూపాయల్ని 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం రిటర్న్స్ ప్రకారం 35 లక్షలు సంపాదిస్తారు. నెలకు 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే 30 ఏళ్లకు 1.05 కోట్లు రూపాయలు పొందవచ్చు అది కూడా కనీసం 12 శాతం రిటర్న్స్ లెక్క ప్రకారం. రిటర్న్స్ పెరిగేకొద్దీ సంపాదన పెరుగుతుంది. 15 శాతం రిటర్న్స్ అందితే నెలకు 1000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్‌మెంట్‌పై 70 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 


Also read; NPS Withdrawal Rules: ఎన్‌పీఎస్ నిబంధనల్లో మార్పులు.. ఆ సౌకర్యంతో ఎంతో మేలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook