Tata Nexon Price in India: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కారు కొనుకోవాలనే కోరిక ఉంటుంది. దీంతో వారు కొంత మెుత్తాన్ని పొదుపు చేసి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు ఉన్న కారును కొనుగోలు చేయాలని అనుకుంటారు. అంతేకాకుండా వీరు వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు మంచి పీచర్లుతోపాటు సేఫ్టీ రేటింగ్‌ను కూడా చూస్తారు. అలాంటి అద్భుతమైన ఫీచర్లు, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తోపాటు లో బడ్జెట్ లో దొరికే కారు గురించి చెప్పబోతున్నాం. దీనికి డౌన్‌పేమెంట్ ఫేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే కార్లలో టాటా నెక్సన్ ఒకటి. ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ కారులో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది చాలా పవర్ పుల్ ఇంజిన్ తో వస్తుంది. ఎక్కువ మైలేజిని ఇస్తుంది. సేప్టీ విషయంలో దీనికి తిరుగులేదు. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా 360 డిగ్రీ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్, ABS, EBD, చైల్డ్ లాక్, ISOFIX చైల్డ్ సీట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్ AC, వెనుక AC వెంట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు కూడా కారులో కనిపిస్తాయి.


శక్తివంతమైన ఇంజిన్
కారు ఇంజిన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో నడుస్తోంది.1.2 లీటర్ కలిగిన పెట్రోల్ ఇంజిన్ 22 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. అదే 1.5 లీటర్ కలిగిన డీజిల్ ఇంజిన్ కారు లీటరుకు 28 కిలోమీటర్ల వరకు వస్తుంది.


Also Read: Car Mileage Boosting Tips: ఎలాంటి ఖర్చులు లేకుండా ఈ టిప్స్‌తో మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు..


ధర 
మీరు టాటా నెక్సాన్ బేస్ మోడల్‌ని కొనుగోలు చేస్తే.. దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 809,990. మీరు ఢిల్లీలో అయితే ఆన్-రోడ్ దీనిని రూ. 9,09,253 ధరకు పొందుతారు. ఇప్పుడు మీరు దీనిపై రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చేస్తే.. మీకు రూ. 8,09,253 ధరతో కారు లోన్ లభిస్తుంది. 9 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా EMIగా రూ. 13,020 చెల్లించాలి. మీరు 7 సంవత్సరాలలో మొత్తం రూ.10,93,691 చెల్లించాలి. ఇందులో మీకు రూ.2,84,438 వడ్డీగా ఇస్తారు. అయితే, మీరు బ్యాంక్ నిబంధనలు మరియు మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మాత్రమే కారు లోన్ పొందుతారు.


Also Read: Hyundai Creta 2024 Facelift: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్..ధర, మైలేజ్ పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter