TATA Digital Payments: డిజిటల్ పేమెంట్స్ వ్యాపారంలో టాటా సంస్థ, త్వరలో ప్రారంభం
TATA Digital Payments: ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ పేమెంట్స్ కన్పిస్తున్నాయి. ఐదు పది రూపాయలైనా సరే డిజిటల్ లావాదేవీలకే ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడీ వ్యాపారంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అడుగుపెడుతోంది.
TATA Digital Payments: ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ పేమెంట్స్ కన్పిస్తున్నాయి. ఐదు పది రూపాయలైనా సరే డిజిటల్ లావాదేవీలకే ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడీ వ్యాపారంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అడుగుపెడుతోంది.
డిజిటల్ పేమెంట్స్ విధానం. డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ఆదరణ నేపధ్యంలో విస్తరిస్తున్న వ్యాపార విధానం. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఈ వ్యాపారంలో అడుగుపెడుతోంది. తాజాగా యూపీఐ ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టడంపై కసరత్తు ముమ్మరం చేసింది. థర్డ్‌పార్టీ పేమెంట్స్ అప్లికేషన్ ప్రొవైడరుగా డిజిటల్ చెల్లింపు సేవలు అందించేందుకు అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే ఎన్‌పీసీఐకి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. యూపీఐ సేవలకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఓ ప్రైవేట్ బ్యాంక్‌తో టాటా డిజిటల్ చర్చలు జరుపుతున్నట్లు టాటా వర్గాలు తెలిపాయి. మరో బ్యాంకింగ్ భాగస్వామితో కూడా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో టాటా యూపీఐ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ కామర్స్‌లో విస్తరించాలని భావిస్తున్న టాటాకు యూపీఐ యాప్ ఉంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ ఆఫర్లతో వినియోగదారులకు ఆకర్షించే అవకాశం ఉంది. తన సొంత యూపీఐ సర్వీసుల ద్వారా యూజర్లకు క్యాష్‌బ్యాక్, ఇతరత్రా ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వినియోగదారులకు పెంచుకోవచ్చని అంటున్నారు.
తన కొత్త పేమెంట్స్ యాప్‌ను ఐపీఎల్-2022 ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరించాలని టాటా డిజిటల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనితోపాటు యూపీఐ యాప్ కూడా అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. యూపీఐ ద్వారా ఫిబ్రవరిలో 452 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి నాన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు..యూపీఐ కార్యకలాపాల కోసం వివిధ బ్యాంకులతో చేతులు కలిపాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల భాగస్వామ్యం ద్వారా యూపీఐ సర్వీసులు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టాటా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Also read: Netflix charges: నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే ఇక ఛార్జీల మోత- త్వరలో కొత్త రూల్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook