Tata Motors Commercial Vehicles Prices: టాటా మోటార్స్ కి చెందిన కమెర్షియల్ వాహనాలను కొనుగోలు చేసే వారికి టాటా మోటార్స్ కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే టాటా మేడ్ కమెర్షియల్ వాహనాలపై ధరలను 5 శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్ స్పష్టంచేసింది. మరో 10 రోజుల్లో.. అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ ధరల పెంపు వర్తిస్తుంది అని టాటా మోటార్స్ కంపెనీ తమ తాజా ప్రకటనలో పేర్కొంది. టాటా మోటార్స్ చేసిన ఈ ప్రకటనతో టాటా కమెర్షియల్ వాహనాల కొనుగోలుదారులకు కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతోనే షాక్ తగిలినట్టయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా మోటార్స్ కమెర్షియల్ వాహనాల ధరల పెంపు అనంతరం కొత్త ధరల సరళి వివిధ మోడల్స్ లో ఉన్న వివిధ వేరియంట్స్ ప్రకారం మారుతూ ఉంటుందని టాటా మోటార్స్ వెల్లడించింది. ధరల పెరుగుదలకు కారణాలను వివరిస్తూ బిఎస్ 6 లో రెండో దశ నిబంధనల అమలులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి కఠినమైన నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఆయా నిబంధనలకు అనుగుణంగా తమ మొత్తం వాహనాల పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు టాటా మోటార్స్ వివరించింది. 


టాటా మోటార్స్ కంపెనీ విక్రయిస్తున్న వాహనాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 2023లో టాటా మోటార్స్ మొత్తం 79,705 వాహనాలు విక్రయించగా.. అందులో ప్యాసింజర్ వెహికిల్స్ సంఖ్య 43,140 కాగా కమెర్షియల్ వాహనాల సంఖ్య 36,565 గా ఉన్నాయి. ఈ సంఖ్యను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వాహనాల సంఖ్యతో కమెర్షియల్ వాహనాల సంఖ్య పోటీపడటం చూడొచ్చు. ప్యాసింజర్ వెహికిల్స్ కి, కమెర్షియల్ వెహికిల్స్ కి మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవడం చూస్తే.. కమెర్షియల్ వెహికిల్స్ తయారీ, విక్రయాల్లో టాటా మోటార్స్ ఎంత అగ్రెసివ్ గా పనిచేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని ఆటోమొబైల్ ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి .


ఇది కూడా చదవండి : 7 Seater SUV Car: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్


ఇది కూడా చదవండి : SBI Home Loans: ఎస్బీఐ హోమ్ లోన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK