Maruti, Tata, Hyundai Discounts: మారుతి, టాటా, హ్యాందాయ్, మహింద్రా, హోండా కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

Huge Discounts On Maruti, Tata to Hyundai Cars: 2023 మార్చి నెలలో కార్లను కొనుగోలు చేసే వారికి ఏయే వెహికిల్ మేకర్స్ ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో తెలిస్తే.. ఏ కారును ఎంచుకోవచ్చు అనేది ఒక నిర్ణయానికి రావొచ్చు. అలా కొత్తగా కారును కొనేవారి కోసం వివిధ మోటార్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్స్ డేటాను క్లుప్లంగా ఇక్కడ మీ కోసం అందివ్వడం జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 08:44 PM IST
Maruti, Tata, Hyundai Discounts: మారుతి, టాటా, హ్యాందాయ్, మహింద్రా, హోండా కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

Huge Discounts On Maruti, Tata to Hyundai Cars: మారుతి సుజుకి కార్లపై మోడల్స్‌ ప్రకారం కొన్ని కార్లపై రూ. 64 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఆల్టో 800, ఆల్టో K10, ఎస్ ప్రెస్సో, వాగాన్ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్ మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి బ్రెజ్జా, డిజైర్ సీఎన్జీ, ఎర్టిగా కార్లపై ప్రస్తుతానికి ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో లేవని మారుతి కంపెనీ స్పష్టంచేసింది.

మారుతి సుజుకి నెక్సా కారు ఎక్స్‌క్లూజీవ్ మోడల్స్‌ అందిస్తున్న ఆఫర్స్ డేటాను పరిశీలిస్తే... మారుతి సుజుకి ఇగ్నైస్ కారుపై రూ. 54 వేల వరకు డిస్కౌంట్స్, బెలెనో కారుపై రూ. 35 వేల డిస్కౌంట్, సియాజ్ కారుపై 28 వేల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

హ్యూండాయ్ కార్లపై డిస్కౌంట్స్ ఆఫర్స్ విషయానికొస్తే.. గ్రాండ్ ఐ10 నియోస్ కార్లపై రూ. 38 వేల డిస్కౌంట్ లభిస్తుండగా హ్యూందాయ్ ఐ20 కారుపై రూ. 20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. హ్యూందాయ్ ఆరా కారుపై రూ. 33,000 డిస్కౌంట్ అందిస్తోంది. 

టాటా కార్లపై డిస్కౌంట్ విషయానికొస్తే.. టాటా టియాగో, టాటా టిగోర్ కారులో పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లపై రూ. 35 వేల డిస్కౌంట్ లభిస్తోంది. టాటా ఆల్ట్రోజ్ కారుపై టాటా మోటార్స్ రూ. 28 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది. 

మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ అందిస్తున్న ఆఫర్స్‌ని పరిశీలిస్తే.. మహింద్రా 4WD థార్ కారుతో రూ. 60,000 విలువైన యాసెసరీస్‌ని ఆఫర్‌గా అందిస్తోంది. మహింద్రా బొలెరోపై రూ. 45 వేల డిస్కౌంట్ ఆఫర్ అందివ్వడంతో పాటు మరో రూ. 15 వేల విలువైన యాసెసరీస్ ఉచితంగా లభిస్తున్నాయి. బొలెరో నియోపై రూ. 37 వేల డిస్కౌంట్‌తో పాటు రూ. 12 వేల విలువైన యాసెసరీస్ అందిస్తున్నాయి. 

మహింద్రా అండ్ మహింద్రా అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్స్ చెక్ చేస్తే.. మహింద్రా XUV300 కారుపై రూ. 22 వేల డిస్కౌంట్ లభిస్తుండగా.. మరో రూ. 10 వేల విలువైన యాసెసరీస్ ఉచితంగా అందిస్తోంది. మరాజో MPV కారుపై రూ. 27 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

హోండా కార్లలో హోండా అమేజ్ కారుపై రూ. 26 వేల డిస్కౌంట్ లభిస్తుండగా.. 5వ జనరేషన్ హోండా సిటీకి సంబంధించిన MY22 స్టాక్‌పై ఏకంగా రూ. 1.3 లక్ష డిస్కౌంట్ అందిస్తుండటం విశేషం.

స్కోడా కార్లపై డిస్కౌంట్స్ డేటాను గమనిస్తే.. స్కోడా స్లేవియా రూ. 20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండగా రూ. 20 వేల విలువైన లాయల్టీ బెనిఫిట్స్‌తో పాటు కార్పోరేట్ బెనిఫిట్స్ కింద రూ. 15 వేలు ఆఫర్, ఎక్స్‌చేంజ్ కింద రూ. 30 వేల బోనస్ కూడా అందుతుండటం విశేషం.

ఇది కూడా చదవండి : Maruti Suzuki CNG Cars Prices: మారుతి సుజుకి పెట్రోల్, CNG కార్ల ధరల్లో తేడా.. కారు మైలేజ్ 35 కి.మీ రావాలంటే..

ఇది కూడా చదవండి : Best 7 Seater Cars: జస్ట్ రూ. 6.33 లక్షలకే 7 సీటర్ కారు.. మారుతితో పోలిస్తే 5 లక్షల తేడా

ఇది కూడా చదవండి : Hyundai Cars on Discount: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News